1. రెడ్మీ ఇండియా నుంచి భారతదేశంలో ఇటీవల మరో స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. రెడ్మీ నోట్ 11 ఎస్ఈ (Redmi Note 11 SE) మోడల్‌ను రిలీజ్ చేసింది షావోమీ. రూ.15,000 లోపు బడ్జెట్లో (Smartphone Under Rs 15,000) ఈ మొబైల్ రిలీజైంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్, అమొలెడ్ డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 64MP కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Redmi India)
2. ఇప్పటికే ఈ సెగ్మెంట్లో ఉన్న మొబైల్స్‌కు రెడ్మీ నోట్ 11 ఎస్ఈ గట్టి పోటీ ఇవ్వనుంది. ఇక ఇప్పటికే రెడ్మీ నోట్ 11 సిరీస్‌లో రెడ్మీ నోట్ 11 ప్రో+ 5జీ, రెడ్మీ నోట్ 11 ప్రో, రెడ్మీ నోట్ 11ఎస్, రెడ్మీ నోట్ 11, రెడ్మీ నోట్ 11టీ 5జీ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లోకి రెడ్మీ నోట్ 11 ఎస్ఈ వచ్చింది. (image: Redmi India)
3. రెడ్మీ నోట్ 11 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే వేరియంట్లో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రీపెయిడ్ డిస్కౌంట్ రూ.500 లభిస్తుంది. ఈ ఆఫర్లతో రెడ్మీ నోట్ 11 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.12,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: Redmi India)
4. ఫ్లిప్‌కార్ట్‌లో 2022 ఆగస్ట్ 31 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది. థండర్ పర్పుల్, స్పేస్ బ్లాక్, కాస్మిక్ వైట్, బిఫోర్స్ట్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. ఛార్జర్ బాక్సులో రాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. బాక్సులో స్మార్ట్‌ఫోన్, యూఎస్బీ టైప్ సీ కేబుల్, సిమ్ ఎజెక్ట్ టూల్, ప్రొటెక్టీవ్ కేస్ మాత్రమే లభిస్తాయి. ఛార్జర్ వేరుగా కొనాల్సి ఉంటుంది. (image: Redmi India)
5. రెడ్మీ నోట్ 11 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.43 అమొలెడ్ డాట్ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రియల్మీ నార్జో 30, వివో వై73, రెడ్మీ నోట్ 10ఎస్, రియల్మీ 8 లాంటి మోడల్స్‌లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. రెడ్మీ నోట్ 11 ఎస్ఈ ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Redmi India)
6. రెడ్మీ నోట్ 11 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌లో 64మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో 64MP మోడ్, నైట్ మోడ్, ఏఐ బ్యూటిఫై, ఏఐ పోర్ట్రైట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Redmi India)
7. రెడ్మీ నోట్ 11 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో టైమ్డ్ బరస్ట్, ఏఐ బ్యూటిఫై, ఏఐ పోర్ట్రైట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రీడింగ్ మోడ్ 3.0, సన్‌లైట్ మోడ్ 2.0, ఏఐ ఫేస్ అన్‌లాక్, డ్యూయెల్ స్పీకర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Redmi India)