1. ఇండియాలో రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్‌లో రిలీజైన రెడ్మీ నోట్ 11 ప్రో+ 5జీ (Redmi Note 11 Pro + 5G) సేల్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇక రెడ్మీ నోట్ 11 ప్రో (Redmi Note 11 Pro) సేల్ ఈరోజు ప్రారంభం కానుంది. అమెజాన్‌తో పాటు షావోమీ అధికారిక వెబ్సైట్, ఎంఐ స్టోర్, రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. ఫాంటమ్ వైట్, స్టార్ బ్లూ, స్టీల్త్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Redmi India)
3. రెడ్మీ నోట్ 11 ప్రో స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. అమెజాన్‌లో స్టాండర్డ్ ఛార్టర్డ్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్, హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. (image: Redmi India)
4. రెడ్మీ నోట్ 11 ప్రో స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. రెడ్మీ నోట్ 11 ప్రో 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. ఇందులోర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో ర్యామ్‌ను 1జీబీ పెంచుకోవచ్చు. (image: Redmi India)
5. రెడ్మీ నోట్ 11 ప్రో ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ మీడియాటెక్ హీలియో జీ96 గేమింగ్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇటీవల ఈ ప్రాసెసర్‌తో ఇండియన్ మార్కెట్లో వరుసగా స్మార్ట్ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. ఇదే ప్రాసెసర్ పోకో ఎం4 ప్రో 5జీ, రియల్మీ నార్జో 50, రెడ్మీ నోట్ 11ఎస్ మోడల్స్‌లో ఉంది. (image: Redmi India)
6. రెడ్మీ నోట్ 11 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 108మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: Redmi India)
7. రెడ్మీ నోట్ 11 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. హైబ్రిడ్ డ్యూయెల్ సిమ్, బ్లూటూత్ 5.1, డ్యూయెల్ స్పీకర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Redmi India)