1. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days sale) కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ సేల్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రెడ్మీ నోట్ 10టీ 5జీ (Redmi Note 10T 5G) స్మార్ట్‌ఫోన్ గురించి. గతేడాది రూ.15,000 లోపు సెగ్మెంట్లో లభించిన ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) ఇప్పుడు రూ.10,000 లోపే లభిస్తోంది. (image: Redmi India)
3. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో రెడ్మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్‌ను కేవలం రూ.9,999 ధరకే కొనొచ్చు. రూ.10,000 లోపు లభిస్తున్న 5జీ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొనేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. (image: Redmi India)
4. రెడ్మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. ఇదే ప్రాసెసర్ వివో వై75, సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42, పోకో ఎం3 ప్రో, ఒప్పో ఏ53ఎస్ లాంటి మోడల్స్‌లో ఉంది. (image: Redmi India)
5. రెడ్మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. రియర్ కెమెరాలో పోర్ట్రైట్, పనోరమా, ప్రో మోడ్, నైట్ మోడ్, కస్టమ్ వాటర్‌మార్క్, డాక్యుమెంట్ మోడ్, హెచ్డీఆర్, ఏఐ సీన్ డిటెక్షన్, టైమ్ బరస్ట్, గూగుల్ లెన్స్, ఏఐ వాటర్‌మార్క్, మూవీ ఫ్రేమ్, ప్రో కలర్, కలర్ ఫోకస్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Redmi India)