1. రెడ్మీ నుంచి గత నెలలో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. రెడ్మీ నోట్ 10టీ 5జీ (Redmi Note 10T 5G) మోడల్‌ను పరిచయం చేసింది షావోమీ. గత నెలలో సేల్ జరిగినా కొన్ని రోజులపాటు ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో లేదు. ఇప్పుడు మరోసారి రెడ్మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్, షావోమీ ఇండియా వెబ్సైట్లో రెడ్మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. (image: Redmi India)
2. రిలీజ్ నాటితో పోలిస్తే రెడ్మీ నోట్ 10టీ 5జీ (Redmi Note 10T 5G) స్మార్ట్‌ఫోన్ ధర కాస్త పెరిగింది. రిలీజ్ అయినప్పుడు 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా ఇప్పుడు రూ.14,499. ఇక 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రిలీజ్ సమయంలో రూ.15,999 కాగా ఇప్పుడు రూ.16,499. (image: Redmi India)
3. సిటీ క్రెడిట్ ఈఎంఐ లావాదేవీలతో కొంటే రూ.1,250 అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ లభిస్తుంది. యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్తో కొంటే రూ.1,500 లేదా 7.5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్ఎస్బీసీ క్యాష్‌బ్యాక్ కార్డ్‌తో కొంటే 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. (image: Redmi India)