Redmi Note 10 Pro Max: రెడ్మీ నోట్ 10 సిరీస్‌లో రిలీజ్ అయిన స్మార్ట్‌ఫోన్ ఇది. రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్, 5020ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Redmi India)
Redmi Note 10 Pro Max: రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్‌లో 108మెగాపిక్సెల్ సాంసంగ్ ISOCELL GW3 సెన్సార్ ఉంది. దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ 6జీబీ+64జీబీ ధర రూ.18,999 కాగా, 6జీబీ+128జీబీ ధర రూ.19,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.21,999. (image: Redmi India)
Redmi Note 10 Pro: రెడ్మీ నోట్ 10 సిరీస్‌లో రిలీజ్ అయిన మరో స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 10 ప్రో. ఇందులో రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్‌లో ఉన్నట్టుగానే 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్, 5020ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. (image: Redmi India)
Redmi Note 10 Pro: రెడ్మీ నోట్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 64మెగాపిక్సెల్ సాంసంగ్ ISOCELL GW3 సెన్సార్ ఉంది. దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ 6జీబీ+64జీబీ ధర రూ.15,999 కాగా, 6జీబీ+128జీబీ ధర రూ.17,499. హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.18,999. (image: Redmi India)
Poco X3 Pro: పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ Sony IMX582 సెన్సార్‌తో ప్రైమరీ కెమెరా ఉంది. దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లు ఉన్నాయి. 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. పోకో ఎక్స్3 ప్రో 6జీబీ+128జీబీ ధర రూ.18,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.20,999. (image: Poco India)
Realme 8 Pro: రియల్మీ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ సాంసంగ్ ISOCELL HM2 ప్రైమరీ సెన్సార్ ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. రియల్మీ 8 ప్రో 6జీబీ+128జీబీ ధర రూ.17,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.19,999. (image: Realme India)
Realme Narzo 30 Pro: రియల్మీ నార్జో 30 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్. ఇందులో 6.5 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్, ఆండ్రాయిడ్ 10 + రియల్మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Realme India)
Realme Narzo 30 Pro: రియల్మీ నార్జో 30 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 48మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంది. దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. రియల్మీ నార్జో 30 ప్రో 6జీబీ+64జీబీ ధర రూ.15,999 కాగా, 8జీబీ+128జీబీ ధర రూ.17,999. (image: Realme India)