Redmi 9i | షావోమీ ఇటీవల రిలీజ్ చేసిన రెడ్మీ 9ఐ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే డిస్కౌంట్ పొందొచ్చు. ధర, స్పెసిఫికేషన్స్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి.
1. షావోమీ దూకుడుగా కొత్త స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తూనే ఉంది. ఒక ఫోన్ తర్వాత మరో కొత్త మోడల్‌ను పరిచయం చేస్తూనే ఉంది. ఇప్పుడు రెడ్మీ 9 సిరీస్‌లో రెడ్మీ 9ఐ మోడల్‌ను రిలీజ్ చేసింది. (image: Redmi India)
2/ 20
2. ఇప్పటికే 9 సిరీస్‌లో రెడ్మీ 9, రెడ్మీ 9ఏ, రెడ్మీ 9 ప్రైమ్, రెడ్మీ నోట్ 9, రెడ్మీ నోట్ 9 ప్రో, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ మోడల్స్ మార్కెట్లో ఉన్నాయి. ఈ సిరీస్‌లో వచ్చిన 7వ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ 9ఐ. (image: Redmi India)
3/ 20
3. ఇది ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్. ధర కూడా రూ.9,000 లోపే. మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్ బాక్సులోనే ఉంటుంది. (image: Redmi India)
4/ 20
4. రెడ్మీ 9ఐ 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ చేసింది షావోమీ. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, ఎంఐ హోమ్ స్టోర్స్‌తో పాటు షావోమీ ఇండియా అధికారిక వెబ్సైట్లో రెడ్మీ 9ఐ సేల్ మొదలవుతుంది. ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కూడా ఈ ఫోన్ కొనొచ్చు. (image: Redmi India)
5/ 20
5. రెడ్మీ 9ఐ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.53 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Redmi India)