Redmi 9 Prime: రూ.10,000 లోపు రెడ్మీ 9 ప్రైమ్ మోడల్‌ను రిలీజ్ చేసింది షావోమీ. ఇందులో మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్, 5,020 భారీ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ లాంటి ప్రత్యేకతలున్నాయి. బాక్సులో 10వాట్ ఛార్జర్ మాత్రమే లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే 18 వాట్ ఛార్జర్ వేరుగా తీసుకోవాలి. (image: Redmi India)
Moto E7 Plus: లెనోవోకు చెందిన మోటోరోలా ఇండియాలో మోటో ఈ7 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా ఉంటుంది.
Realme Narzo 20A: రియల్మీ నార్జో 20ఏ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 10 + రియల్మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పిచేస్తుంది. గ్లోరీ సిల్వర్, విక్టరీ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.8,499 కాగా 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,499.
Redmi 9i: రెడ్మీ 9ఐ ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో డ్యూయెల్ సిమ్ + ఎస్డీ కార్ట్ స్లాట్ ఉంటుంది. రెడ్మీ 9ఐ మిడ్నైట్ బ్లాక్, సీ బ్లూ, నేచర్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.8,299 కాగా, 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.9,299. (image: Redmi India)
Redmi 9: రెడ్మీ 9 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.53 అంగుళాల హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 13+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్. బ్యాటరీ 5,000ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ 10+ఎంఐయూఐ12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Redmi India)