Redmi 11 Prime 5G: రెడ్మీ 11 ప్రైమ్ సిరీస్‌లో రెడ్మీ 11 ప్రైమ్ 5జీ, రెడ్మీ 11 ప్రైమ్ 4జీ మోడల్స్ రిలీజ్ అయ్యాయి. రెడ్మీ 11 ప్రైమ్ 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. సెప్టెంబర్ 9న సేల్ ప్రారంభం అవుతుంది. (image: Redmi India)
Redmi 11 Prime 5G: రెడ్మీ 11 ప్రైమ్ 5జీ ఫీచర్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000mAh బ్యాటరీ, 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Redmi India)
Redmi 11 Prime: రెడ్మీ 11 ప్రైమ్ కూడా రెండు వేరియంట్లలో లభిస్తోంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. ప్లేఫుల్ గ్రీన్, పెప్పీ పర్పుల్, ఫ్లాషీ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. సేల్ తేదీని ప్రకటించలేదు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో అందుబాటులోకి రావొచ్చు. (image: Redmi India)
Redmi 11 Prime: రెడ్మీ 11 ప్రైమ్ ఫీచర్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000mAh బ్యాటరీ, 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Redmi India)
Realme C33: రియల్మీ నుంచి రూ.10,000 లోపు బడ్జెట్లో రియల్మీ సీ33 రిలీజైంది. రియల్మీ సీ33 స్మార్ట్‌ఫోన్ 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999 కాగా, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. సెప్టెంబర్ 12న సేల్ ప్రారంభం అవుతుంది. రియల్మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. (image: Realme India)
Redmi A1: రెడ్మీ ఏ సిరీస్‌లో తొలి స్మార్ట్‌ఫోన్ రెడ్మీ ఏ1 రిలీజైంది. ధర రూ.6,499. ఇది ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్. 2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో మాత్రమే రిలీజైంది. సెప్టెంబర్ 9 సాయంత్రం 4 గంటలకు సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్‌తో పాటు షావోమీ అధికారిక వెబ్సైట్లో కొనొచ్చు. బ్లాక్, లైట్ బ్లూ, లైట్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. (image: Redmi India)
Redmi A1: రెడ్మీ ఏ1 ఫీచర్స్ చూస్తే 6.52 అంగుళాల డిస్ప్లే, మీడియాటెక్ హీలియో ఏ22, 2జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ సపోర్ట్, డ్యూయెల్ సిమ్ కార్డ్స్ స్లాట్, క్లీన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, 8మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000mAh బ్యాటరీ, 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Redmi India)