1. షావోమీ ఇండియా రెడ్మీ 10 సిరీస్‌లో (Redmi 10 Series) ఇటీవల మరో రెండు స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. రెడ్మీ 10ఏ (Redmi 10A), రెడ్మీ 10 పవర్ (Redmi 10 Power) మోడల్స్‌ని పరిచయం చేసింది. ఇప్పటికే రెడ్మీ 10 సిరీస్‌లో రెడ్మీ 10, రెడ్మీ 10 ప్రైమ్ మోడల్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రెడ్మీ 10ఏ, రెడ్మీ 10 పవర్ మోడల్స్‌ని తీసుకొచ్చింది. (image: Redmi India)
3. రెడ్మీ 10ఏ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499 కాగా, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499. ఇదే బడ్జెట్లో ఉన్న సాంసంగ్ గెలాక్సీ ఏ03, టెక్నో స్పార్క్ 8 ప్రో, రియల్మీ నార్జో 50ఐ లాంటి మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. (image: Redmi India)
7. రెడ్మీ 10ఏ స్మార్ట్‌ఫోన్‌లో ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉండటం విశేషం. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్‌తో 512జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తూ 4జీ నెట్వర్క్, బ్లూటూత్ 5.0, టైప్ సీ పోర్ట్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. (image: Redmi India)