1. అమెజాన్‌లో రెడ్మీ డేస్ సేల్ (Redmi Days Sale) కొనసాగుతోంది. ఈ సేల్ జూన్ 10న ముగుస్తుంది. రెడ్మీ స్మార్ట్ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. రెడ్మీ ఇండియా గతేడాది రిలీజ్ చేసిన రెడ్మీ 10 ప్రైమ్ (Redmi 10 Prime) స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,000 బడ్జెట్లో కొనొచ్చు. కంపెనీ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. (image: Redmi India)
2. రెడ్మీ 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. రిలీజ్ అయినప్పుడు 4జీబీ ర్యామ్ + 64జీబీ వేరియంట్ ధర రూ.12,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ ధర రూ.14,499. ప్రస్తుతం 4జీబీ+64జీబీ వేరియంట్ రూ.11,499 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.13,999 ధరకు లిస్ట్ అయింది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. (image: Redmi India)
3. ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్‌తో రెడ్మీ 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.10,499 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.12,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఆస్ట్రాల్ వైట్, బైఫ్రోస్ట్ బ్లూ, ఫాంటమ్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. ఎక్స్ఛేంజ్ ద్వారా కొనాలనుకునేవారికి రూ.10,850 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ జూన్ 10 వరకే అందుబాటులో ఉంటాయి. (image: Redmi India)
4. రెడ్మీ 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ విశేషాలు చూస్తే 2020లో రిలీజ్ అయిన రెడ్మీ 9 ప్రైమ్ అప్‌గ్రేడెడ్ వేరియంట్ ఇది. రెడ్మీ 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. రెడ్మీ 9 ప్రైమ్ లాగానే రెడ్మీ 10 ప్రైమ్ మోడల్లో కూడా మంచి ఫీచర్స్ ఉన్నాయి. రెడ్మీ 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. (image: Redmi India)
5. రెడ్మీ 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ ఇన్ఫీనిక్స్ నోట్ 12, ఇన్ఫీనిక్స్ హాట్ 11ఎస్ లాంటి మోడల్స్‌లో ఉంది. ఈ మొబైల్ 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో లభిస్తుంది. జీబీ+64జీబీ వేరియంట్లో మైక్రోఎస్డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. 6జీబీ+128జీబీ వేరియంట్లో మైక్రోఎస్డీ కార్డుతో 2టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. (image: Redmi India)
6. రెడ్మీ 10 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా ఫీచర్స్ చూస్తే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: Redmi India)