ఎప్పుడూ ఉద్యోగం ఊడుతుందో తెలియని గందరగోళ పరిస్థితులలో ఆయా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు ముందస్తు జాగ్రత్తగా వేరే ఉద్యోగాలను వెతుక్కుంటున్నారు. కొందరు ఒక కంపెనీలో పనిచేస్తూనే రహస్యంగా వేరే ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ ఉండగా, ఇంకొందరు బహిరంగంగానే తమ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. ఇందులో అమెజాన్ (Amazon) డాట్ కామ్ ఉద్యోగులు కూడా ఉన్నారు.
అలాంటి పొజిషన్లో ఉన్న ఆమె ఇప్పుడు తన ఉద్యోగం గురించే ఎక్కువగా ఆందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెజాన్ కంపెనీ స్పందిస్తూ ఉద్యోగం కోల్పోయిన వారికి మద్దతు ఇవ్వడానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపింది. సపరేషన్ పేమెంట్, ట్రాన్సిషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, ఎక్స్టర్నల్ జాబ్ ప్లేస్మెంట్ సపోర్ట్ అందిస్తున్నామని వివరించింది.
* ఉంటుందా? ఊడుతుందా? : ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో కొత్త ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నట్లు లింక్డ్ఇన్లో ఇటీవల ఒక అమెజాన్ మేనేజర్ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఉద్యోగులు ఇలాంటి అస్థిరమైన పరిస్థితులలో ఎవరికివారు జాగ్రత్త పడటంలో తప్పు లేదని ఫీల్ అవుతున్నారు. వారు కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నారు. అమెజాన్ సంస్థలో ఉండాలని వీరికి కోరిక ఉన్నా అవి తమ చేతుల్లో లేదు కాబట్టి ఇతర కంపెనీలకు రెజ్యూమ్ (Resumes)లు పంపడం అనివార్యంగా మారుతుంది.
రిక్రూట్మెంట్ చేపట్టే ఉద్యోగులకు ఇంజనీర్ల కంటే తక్కువ శాలరీ లభిస్తుంది. వాస్తవానికి హెచ్ఆర్గా పని చేసేవారు లేదా రిక్రూటింగ్ సెక్షన్లో పనిచేసే చాలా మంది వ్యక్తులు వర్క్‌ఫోర్స్‌కు కొత్తగా జాయిన్ అవుతుంటారు. వీరు పెద్దగా డబ్బు సంపాదించరు. సంపాదించిన డబ్బును అద్దె, కారు, ఇతర ఖర్చులు వంటి వాటికి చెల్లించిన తర్వాత వారి వద్ద ఎక్కువ డబ్బు మిగిలి ఉండదు.