REALME X7 PRO TO REDMI NOTE 10 PRO THESE SMARTPHONES LAUNCHING IN DECEMBER 2020 SS
December Smartphones: డిసెంబర్లో రిలీజ్ కాబోయే స్మార్ట్‌ఫోన్స్ ఇవే
December Smartphones | నవంబర్‌లో పండుగ సీజన్ కావడంతో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు సేల్స్ పైనే దృష్టి పెట్టాయి. అందుకే నవంబర్‌లో స్మార్ట్ఫోన్ల రిలీజ్ ఎక్కువ కాలేదు. డిసెంబర్లో చాలా స్మార్ట్‌ఫోన్స్ ఇండియన్ మార్కెట్లో రిలీజ్ కానున్నాయి. వాటి గురించి తెలుసుకోండి.
1. Oppo Reno5 Series: ఒప్పో నుంచి రెనో 5 సిరీస్ స్మార్ట్ఫోన్లు డిసెంబర్లో రిలీజ్ కానున్నాయి. ఒప్పో రెనో 5 స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్, ఒప్పో రెనో 5 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో డైమెన్సిటీ 1000+ చిప్సెట్ ఉంటాయి. ఈ రెండు ఫోన్లలో 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
2/ 9
2. Xiaomi Redmi Note 10 and Note 10 Pro: షావోమీ రెడ్మీ నోట్ 10, రెడ్మీ నోట్ 10 ప్రో స్మార్ట్ఫోన్లు డిసెంబర్లో రిలీజ్ కానున్నాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లలో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.
3/ 9
3. Realme X7 and X7 Pro: రియల్మీ నుంచి ఎక్స్ సిరీస్‌లో మరో రెండు స్మార్ట్ఫోన్లు రానున్నాయి. రియల్మీ ఎక్స్7, రియల్మీ ఎక్స్7 ప్రో స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ రెండు ప్రీమియం మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ఫోన్లు.
4/ 9
4. Vivo V20 Pro: వివో నుంచి వివో వీ20 ప్రో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అవుతోంది. రూ.30,000 బడ్జెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది. స్నాప్‌డ్రాగన్ 765జీ 5జీ ప్రాసెసర్, ఐదు కెమెరాలు, అమొలెడ్ డిస్ప్లే లాంటి ప్రత్యేకతలున్నాయి.
5/ 9
5. Infinix Zero 8i: ఇన్ఫీనిక్స్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రానుంది. ఇన్ఫీనిక్స్ జీరో 8ఐ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో రిలీజ ్కానుంది. ఇందులో ఆరు కెమెరాలు, గేమింగ్ ఫోకస్డ్ చిప్సెట్ లాంటి ప్రత్యేకతలుంటాయి.
6/ 9
6. Nokia 5.4: నోకియా నుంచి 5 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది. ఇది నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ వర్షన్.
7/ 9
7. Tecno Pova: టెక్నో నుంచి 'పోవా' పేరుతో మరో స్మార్ట్‌ఫోన్ వస్తోంది. డిసెంబర్ 4న ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది.
8/ 9
8. Moto G9 Power: మోటోరోలా ఇండియాలో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయనుంది. రూ.15,000 సెగ్మెంట్లో మోటో జీ9 పవర్ రిలీజ్ చేయనుంది కంపెనీ.
9/ 9
9. Lenovo Lemon K12 Series: లెనోవో నుంచి లెమన్ కే12 సిరీస్ స్మార్ట్ఫోన్లు రిలీజ్ కానున్నాయి. ఇవి మోటో జీ9 రీబ్రాండెడ్ స్మార్ట్ఫోన్లు కావచ్చని అంచనా వేస్తున్నారు.