REALME X50 PRO 5G DETAILED IMAGE GALLERY OF INDIAS FIRST 5G SMARTPHONE KNOW SPECIFICATIONS AND PRICE DETAILS SS
Realme X50 Pro 5G: తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ 'రియల్మీ ఎక్స్50 ప్రో 5జీ' ఎలా ఉందో చూడండి
Realme X50 Pro 5G | ప్రస్తుతం ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 4జీ మోడల్స్‌దే హవా. కానీ రియల్మీ ఏకంగా 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చింది. రియల్మీ ఎక్స్50 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాకు పరిచయం చేసింది. ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.
1. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ ఇస్తున్న రియల్మీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. రియల్మీ ఎక్స్50 ప్రో 5జీ పేరుతో తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. (image: Realme India)
2/ 20
2. రియల్మీ ఎక్స్50 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 90 Hz రిఫ్రెష్ రేట్‌తో సూపర్ అమొలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 12జీబీ వరకు ర్యామ్ లాంటి ప్రత్యేకతలున్నాయి. అంతేకాదు... 32+8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండటం విశేషం. (image: Realme India)
3/ 20
3. రియల్మీ ఎక్స్50 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లోని 4200 ఎంఏహెచ్ బ్యాటరీ 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. (image: Realme India)
4/ 20
4. రియల్మీ ఎక్స్50 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సాంసంగ్ సూపర్ అమొలెడ్ డిస్ప్లే ఉండటం విశేషం. (image: Realme India)
6. రియల్మీ ఎక్స్50 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 12 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్స్+64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా+8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ అండ్ మైక్రో లెన్స్+బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ ఉన్నాయి. (image: Realme India)
8. రియల్మీ ఎక్స్50 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 4200 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 65వాట్ సూపర్ డార్ట్ ఛార్జ్ టెక్నాలజీతో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. (image: Realme India)
9/ 20
9. రియల్మీ ఎక్స్50 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రియల్మీ యూఐ+ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Realme India)
10/ 20
10. రియల్మీ ఎక్స్50 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రస్ట్ రెడ్, మాస్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. (image: Realme India)
11/ 20
11. రియల్మీ ఎక్స్50 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.37,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.39,999. ఇక హైఎండ్ వేరియంట్ 12జీబీ+256జీబీ ధర రూ.44,999. (image: Realme India)
12/ 20
12. రియల్మీ ఎక్స్50 ప్రో 5జీ ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజీవ్‌గా లభిస్తుంది. 2020 ఫిబ్రవరి 24 సాయంత్రం 6 గంటలకు సేల్ ప్రారంభం కానుంది. (image: Realme India)
13/ 20
13. ఇండియాలో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం లేకుండా ఈ ఫోన్లోనే 5జీ నెట్వర్క్ వాడుకోవచ్చు. (image: Realme India)
14/ 20
14. ఇండియాలో 5జీ నెట్వర్క్ ఎప్పట్లోగా అందుబాటులోకి వస్తుందన్న స్పష్టత లేదు. కానీ స్పీడ్ ఫర్ ది ఫ్యూచర్ పేరుతో 5జీ మోడల్‌ను ఇండియాకు తీసుకొచ్చింది రియల్మీ. (image: Realme India)