Realme 5G Phone: రియల్మీ మరో సంచలనం... రూ.7,000 ధరకే 5జీ ఫోన్
Realme 5G Phone: రియల్మీ మరో సంచలనం... రూ.7,000 ధరకే 5జీ ఫోన్
Realme 5G Phone | ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రియల్మీ అనేక సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. త్వరలో రూ.10,000 లోపే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయబోతోంది రియల్మీ. పూర్తి వివరాలు తెలుసుకోండి.
1/ 8
1. ఇండియాలో తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసి ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. ఇక ఇటీవల రూ.15,000 లోపే 5జీ మొబైల్‌ను పరిచయం చేసింది. అంతేకాదు... ఇప్పుడు రియల్మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ర.13,999 ధరకే కొనొచ్చు. (image: Realme India)
2/ 8
2. ఇంత తక్కువ ధరకు 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఏ కంపెనీ అందించట్లేదు. ఇక త్వరలో రియల్మీ మరో సంచలనం సృష్టించబోతోంది. రూ.7,000 ధరకే 5జీ ఫోన్ రిలీజ్ చేయనుందన్న వార్తలు వస్తున్నాయి. (image: Realme India)
3/ 8
3. ఇండియాలో ఇంకా 5జీ నెట్వర్క్ లేదు. అయితే అంతకన్నా ముందే మొబైల్ కంపెనీలు అప్రమత్తం అవుతున్నాయి. పోటాపోటీగా 5జీ మోడల్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. (image: Realme India)
4/ 8
4. ఇండియాలో త్వరలో 5జీ కనెక్టివిటీ రానుండటంతో 5జీ స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ అవుతున్నాయి. రియల్మీ ఇండియాలో 100 డాలర్లు అంటే సుమారు రూ.7,000 ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయనున్నట్టు రియల్మీ ఇండియా అధినేత మాధవ్ షేఠ్ తెలిపారు. (image: Realme India)
5/ 8
5. తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ అందించబోతున్నట్టు రియల్మీ ఇండియా అధినేత మాధవ్ షేఠ్ ప్రకటించారు. ప్రస్తుతం రియల్మీ నుంచి ఇండియాలో పలు 5జీ స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. (image: Realme India)
6/ 8
6. రియల్మీ ఎక్స్7, రియల్మీ ఎక్స్7 ప్రో, రియల్మీ ఎక్స్7 మ్యాక్స్, రియల్మీ నార్జో 30 ప్రో, రియల్మీ ఎక్స్50 ప్రో, రియల్మీ 8 5జీ మోడల్స్ ఉన్నాయి. వీటిలో రియల్మీ 8 5జీ తక్కువ ధరకే లభిస్తుంది. (image: Realme India)
7/ 8
7. రూ.20,000 లోపు రియల్మీ నుంచి మూడు 5జీ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. అయితే రూ.10,000 లోపే 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయాలని రియల్మీ లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు... 2022 నాటికి 20 5జీ ఫోన్లు లాంఛ్ చేయాలని రియల్మీ భావిస్తోంది. (image: Realme India)
8/ 8
8. ప్రస్తుతం రియల్మీ లాంఛ్ చేస్తున్న ఫోన్లలో 40 శాతం 5జీ స్మార్ట్‌ఫోన్స్ ఉంటున్నాయి. 2022 నాటికి 70 శాతం 5జీ ఫోన్స్ రిలీజ్ చేసేందుకు రియల్మీ ప్రణాళికలు రూపొందిస్తోంది. (image: Realme India)