REALME SMARTPHONES RECEIVING NEW ANDROID 10 BASED REALME UI KNOW ABOUT FEATURES SS
Realme: మీ దగ్గర ఈ రియల్మీ ఫోన్ ఉంటే మీకు గుడ్ న్యూస్
Realme UI | రియల్మీ... ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షావోమీ తర్వాత అదే స్థాయిలో సంచలనాలు సృష్టిస్తున్న కంపెనీ. తమ బ్రాండ్ స్మార్ట్ఫోన్లు వాడుతున్నవారికి కొత్తకొత్త ఫీచర్స్ అందిస్తోంది రియల్మీ. ఇప్పుడు రియల్మీ యూజర్ ఇంటర్ఫేస్ రిలీజ్ చేసింది. ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.
1. మీరు రియల్మీ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? అయితే మీకు శుభవార్త. రియల్మీ యూజర్ ఇంటర్ఫేస్-UI వచ్చేసింది. కొద్దిరోజుల క్రితమే ఆండ్రాయిడ్ 10 బేస్డ్ రియల్మీ యూఐ ప్రకటించింది కంపెనీ. ఇప్పుడు రియల్మీ స్మార్ట్ఫోన్లకు రియల్మీ యూఐ అప్డేట్స్ వస్తున్నాయి. (image: Realme)
2/ 14
2. ఇప్పటివరకు రియల్మీ ఫోన్లన్నీ కలర్ ఓఎస్‌తో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కలర్ ఓఎస్ నచ్చనివాళ్లు రియల్మీ ఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపట్లేదని కంపెనీ గుర్తించింది. అందుకే సొంతగా యూఐ రూపొందించింది రియల్మీ. (image: Realme)
3/ 14
3. స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా రియల్మీ యూఐ రూపొందించినట్టు కంపెనీ చెబుతోంది. ఐకాన్స్ కస్టమైజేషన్, ప్రకృతిని తలపించే వాల్ పేపర్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ ఫీచర్ లాంటి ప్రత్యేకతలు రియల్మీ యూఐలో ఉంటాయి. (image: Realme)
4/ 14
4. మామూలుగా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి మూడు వేళ్లతో స్క్రీన్‌పైన స్వైప్ చేయడం అలవాటు. కానీ... రియల్మీ యూఐలో జస్ట్ మూడు వేళ్లతో హోల్డ్ చేస్తే చాలు... స్క్రీన్‌షాట్ వచ్చేస్తుంది. (image: Realme)
5/ 14
5. ఇక మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిన కాల్ హిస్టరీ, కాంటాక్ట్స్, మెసేజెస్‌కు ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. ఇప్పటికే కొన్ని ఫోన్లకు రియల్మీ యూఐ రిలీజ్ అయింది. మరి ఎప్పుడెప్పుడు ఏఏ ఫోన్లకు రియల్మీ యూఐ అప్డేట్ వస్తుందో తెలుసుకోండి. (image: Realme)