Realme తన ప్లాట్‌ఫారమ్‌లో రియాలిటీ డేస్‌ను ప్రకటించింది. సేల్ లో వినియోగదారులకు తక్కువ ధరలకు స్మార్ట్ఫోన్లు, ఇయర్‌బడ్‌లు, ఇతర ఉపకరణాలను కొనుగోలు చేయడానికి చేసుకోవచ్చు. వినియోగదారులు తక్కువ ధరకు అనేక వస్తువులను కొనుగోలు చేయగలిగినప్పటికీ, మీరు రియల్ మి ఫోన్ల అభిమాని అయితే, రియల్ మి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ యొక్క రియల్మీ జిటి మాస్టర్ ఎడిషన్ మెరుగైన ఆఫర్లతో సొంతం చేసుకోవచ్చు. realme.com/in డేటా ప్రకారం, ఈ ఫోన్ రూ. 25,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది.
Realme GT మాస్టర్ ఎడిషన్ గురించిన వివరాల్లోకి వెళ్తే.. ఇది 6.43-అంగుళాల ఫుల్ హెచ్డి + సూపర్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. దీని పిక్సెల్ రిజల్యూషన్ 2400 × 1080 FHD +. ఇది Qualcomm Snapdragon 778G ప్రాసెసర్ మరియు 8GB RAMని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ రియల్ మి ఫోన్ Android 11 ఆధారిత Realme UI 2.0 పై రన్ అవుతుంది.