1. ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీలపై మళ్లీ ఆఫర్స్ లభిస్తున్నాయి. డిస్కౌంట్ ధరలకే స్మార్ట్ టీవీలు కొనొచ్చు. కొన్ని స్మార్ట్ టీవీలపై ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ (Exchange Offers) కూడా ఉన్నాయి. రియల్మీ బడ్జెట్ ధరలో లాంఛ్ చేసిన నియో స్మార్ట్ టీవీ ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ.1,000 ధరకే సొంతం చేసుకునే ఛాన్స్ లభిస్తోంది. (image: Realme India)
2. ప్రస్తుతం రియల్మీ నియో 32 అంగుళాల స్మార్ట్ టీవీ రూ.11,999 ధరకు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈఎంఐ ఆఫర్ రూ.416 నుంచి ప్రారంభం అవుతుంది. (image: Realme India)
3. రియల్మీ నియో 32 అంగుళాల స్మార్ట్ టీవీ కొనేవారికి ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. పాత టీవీ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.10,975 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. మీ పాత టీవీకి రూ.10,975 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వర్తిస్తే మీరు చెల్లించాల్సింది రూ.1,000 మాత్రమే. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ తక్కువ వస్తే మిగతా మొత్తం చెల్లించి స్మార్ట్ టీవీ సొంతం చేసుకోవచ్చు. (image: Realme India)
4. రియల్మీ నియో 32 అంగుళాల స్మార్ట్ టీవీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో రూ.10,000 లోపే లభించింది. భారీ డిస్కౌంట్‌తో రూ.8,999 ధరకే ఈ స్మార్ట్ టీవీని అమ్మింది రియల్మీ. సేల్ ముగిసిన తర్వాత పాత ధరకే ఈ స్మార్ట్ టీవీ లభిస్తోంది. అయితే బ్యాంక్ ఆఫర్స్‌తో రూ.10,000 లోపే ఈ స్మార్ట్ టీవీని కొనొచ్చు. (image: Realme India)
5. రియల్మీ నియో 32 అంగుళాల స్మార్ట్ టీవీ ఫీచర్స్ చూస్తే ఇందులో 60Hz ఎల్ఈడీ డిస్ప్లే ఉంది. పిక్చర్ క్వాలిటీ పెంచేందుకు క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజిన్ సపోర్ట్ ఉంది. టీయూవీ రీన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా ఉంది. ఈ స్మార్ట్ టీవీ మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 512ఎంబీ ర్యామ్, 4జీబీ స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. (image: Realme India)