1. రియల్మీ ఇండియా నార్జో 50 సిరీస్‌లో వరుసగా స్మార్ట్ఫోన్లు రిలీజ్ చేసింది. ఇదే సిరీస్‌లో రియల్మీ నార్జో 50ఐ (Realme Narzo 50i) గతేడాది రిలీజైంది. ఇది బేసిక్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. సాధారణంగా రూ.10,000 లోపే ఈ మొబైల్ లభిస్తోంది. ఇప్పుడు అమెజాన్‌లో మొబైల్ సేవింగ్స్ డేస్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.5,849 ధరకే లభిస్తోంది. (image: Realme India)
3. అమెజాన్ మొబైల్ సేవింగ్స్ డేస్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్స్ చూస్తే సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌పై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే రూ.1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. సిటీబ్యాంక్ క్రెడిట్ ఈఎంఐ ద్వారా కొంటే 10 శాతం తగ్గింపు పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. (image: Realme India)
4. రియల్మీ నార్జో 50ఐ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.5 అంగుళాల డిస్ప్లే ఉంది. యూనిసోక్ 9863 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. టెక్నో పాప్ 5 ఎల్టీఈ, ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 5 ప్రో, ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 6 స్మార్ట్ఫోన్లలో ఇదే ప్రాసెసర్ ఉంది. 2జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. మైక్రోఎస్డీ కార్డుతో స్టోరేజ్ 256జీబీ వరకు పెంచుకోవచ్చు. (image: Realme India)
5. రియల్మీ నార్జో 50ఐ స్మార్ట్‌ఫోన్‌లో 8మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంది. పోర్ట్రెయిట్ మోడ్, ఏఐ బ్యూటీ, హెచ్డీఆర్, ఫేస్-రికగ్నిషన్, ఫిల్టర్, పనోరమిక్ వ్యూ, పోర్ట్రెయిట్ మోడ్, ఎక్స్పర్ట్, టైమ్‌లాప్స్, బ్యూటీ, ఫిల్టర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఏఐ ఫ్రంట్ కెమెరా ఉంది. మింట్ గ్రీన్, కార్బన్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Realme India)
6. రియల్మీ నార్జో 50ఐ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 43 రోజుల స్టాండ్‌బై లభిస్తుందని కంపెనీ చెబుతోంది. 5 శాతం ఛార్జ్ చేస్తే రెండు గంటలపాటు కాల్స్ మాట్లాడొచ్చు. ఆండ్రాయిడ్ 11 బేస్డ్ రియల్మీ యూఐ గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ కార్డ్ + ఎస్డీ కార్డ్ సపోర్ట్ లభిస్తుంది. (image: Realme India)