1. రియల్మీ నార్జో 50 సిరీస్‌లో ఇటీవల మరో స్మార్ట్‌ఫోన్ వచ్చింది. ఇప్పటికే రియల్మీ నార్జో 50 సిరీస్‌లో రియల్మీ నార్జో 50ఐ, రియల్మీ నార్జో 50ఏ మోడల్స్ ఇండియాలో ఉన్నాయి. ఇదే సిరీస్‌లో రియల్మీ నార్జో 50 (Realme Narzo 50) మోడల్ కూడా వచ్చేసింది. గేమింగ్ ఫ్యాన్స్ కోసం ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది రియల్మీ ఇండియా. (image: Realme India)
2. రియల్మీ నార్జో 50 స్మార్ట్‌ఫోన్‌లో ఇందులో 120Hz డిస్ప్లే, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇక రియల్మీ నార్జో 50 రూ.15,000 లోపు బడ్జెట్లో రిలీజైంది. ఈ బడ్జెట్లో ఉన్న మోడల్స్‌కు కూడా రియల్మీ నార్జో 50 గట్టి పోటీ ఇవ్వనుంది. (image: Realme India)
3. రియల్మీ నార్జో 50 స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు చూస్తే 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,499. ఇవి ఇంట్రడక్టరీ ధరలు మాత్రమే. అమెజాన్‌లో మార్చి 3 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం కానుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. (image: Realme India)
4. రియల్మీ నార్జో 50 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ ఇటీవల రిలీజ్ అయిన రెడ్మీ నోట్ 11ఎస్ మోడల్‌తో పాటు రియల్మీ 8ఐ, ఇన్ఫీనిక్స్ నోట్ 11ఎస్ లాంటి మోడల్స్‌లో ఉండటం విశేషం. (image: Realme India)
5. రియల్మీ నార్జో 50 స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. హెచ్డీఆర్, పోర్ట్రైట్ మోడ్, అల్ట్రా మ్యాక్రో, ఏఐ సీన్ రికగ్నిషన్, ఏఐ బ్యూటీ, ఫిల్టర్, క్రోమా బూస్ట్, స్లో మోషన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Realme India)
6. రియల్మీ నార్జో 50 స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో అల్ట్రా స్టెడీ వీడియో, నైట్ మోడ్, పనోరమిక్ వ్యూ, టైమ్‌ల్యాప్స్, పోర్ట్రైట్ మోడ్, హెచ్డీఆర్, ఏఐ సీన్ రికగ్నిషన్, ఏఐ బ్యూటీ, ఫిల్టర్, క్రోమా బూస్ట్, స్లో మోషన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Realme India)
7. రియల్మీ నార్జో 50 స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ సిమ్ సపోర్ట్ ఉంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఒక గంటలో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. (image: Realme India)
8. రియల్మీ నార్జో 50 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో రిలీజైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉంది. 11జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + రియల్మీ యూఐ 2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. స్పీడ్ బ్లాక్, స్పీడ్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. (image: Realme India)