1. అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్ (Amazon Smartphone Upgrade Days) మళ్లీ ప్రారంభమైంది. ఈ సేల్‌లో అన్ని స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. కొన్ని మోడల్స్‌పై గతంలో ఎన్నడూ లేనంత డిస్కౌంట్ లభిస్తుండటం విశేషం. రియల్మీ బ్రాండ్‌కు చెందిన ఓ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ (Gaming Smartphone) రూ.10,000 లోపే కొనొచ్చు. (image: Realme India)
2. రియల్మీ రెండు నెలల క్రితం 120Hz డిస్ప్లే, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్ లాంటి ఫీచర్స్‌తో రియల్మీ నార్జో 50 (Realme Narzo 50) స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రియల్మీ నార్జో 50 సిరీస్‌లో ఈ మోడల్ రూ.15,000 లోపు బడ్జెట్లో రిలీజ్ అయింది. (image: Realme India)
3. అమెజాన్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్‌లో రియల్మీ నార్జో 50 స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,000 లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. రిలీజ్ అయినప్పుడు రియల్మీ నార్జో 50 స్మార్ట్‌ఫోన్ ధరలు చూస్తే 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,499. (image: Realme India)
4. ప్రస్తుతం అమెజాన్‌లో రియల్మీ నార్జో 50 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ రూ.11,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.14,499 ధరకు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను రూ.9,999 ధరకు, హైఎండ్ వేరియంట్‌ను రూ.12,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌తో ఇంత తక్కువ ధరకు లభిస్తున్న మొబైల్ ఇదే. (image: Realme India)
5. రియల్మీ నార్జో 50 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ లేటెస్ట్గా రిలీజైన రెడ్మీ నోట్ 11 ప్రో, పోకో ఎం4 ప్రో 4జీ, రియల్మీ నార్జో 50, రెడ్మీ నోట్ 11ఎస్ స్మార్ట్ఫోన్లలో ఉంది. (image: Realme India)
6. రియల్మీ నార్జో 50 స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. (image: Realme India)