1. దసరా, దీపావళి సందర్భంగా అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ జరగనుంది. ఈ సేల్స్‌లో స్మార్ట్ఫోన్లపై భారీగా తగ్గింపు (Smartphone Discount) లభిస్తూ ఉంటుంది. అందుకే మొబైల్స్ కొనాలనుకునేవారు ఈ సేల్స్ కోసం ఎదురుచూస్తుంటారు. అమెజాన్‌లో అంతకన్నా ముందే ఓ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుండటం విశేషం. (image: Realme India)
2. రియల్మీ నార్జో 50 సిరీస్‌లో (Realme Narzo 50 Series) మూడు నెలల క్రితం రిలీజైన రియల్మీ నార్జో 50 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. రిలీజ్ ధర కన్నా రూ.4,000 తక్కువకే ఈ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. (image: Realme India)
3. రియల్మీ నార్జో 50 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయినప్పుడు ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999. ప్రస్తుతం అమెజాన్‌లో 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.19,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.21,999. (image: Realme India)
4. అమెజాన్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులతో కొంటే రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.17,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.19,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. అంటే రిలీజ్ ధర కన్నా రూ.4,000 తగ్గింపుతో రియల్మీ నార్జో 50 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. (image: Realme India)
5. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర మరింత తగ్గుతుందో లేదో చెప్పలేం. బ్యాంక్ డిస్కౌంట్ కూడా దాదాపు ఇంతే వస్తుంది. కాబట్టి ఈ స్మార్ట్‌ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్నవారికి ఇది మంచి ఆఫరే. ఎక్స్ఛేంజ్ ద్వారా కొంటే రూ.18,600 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. రూ.3,000 నుంచి ఈఎంఐ ఆఫర్స్ ప్రారంభం అవుతాయి. (image: Realme India)
6. రియల్మీ నార్జో 50 ప్రో ఫీచర్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12 + రియల్మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టమ్, 5జీబీ వరకు ర్యామ్ పెంచుకోవడానికి ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉన్నాయి. (image: Realme India)
7. రియల్మీ నార్జో 50 ప్రో కెమెరా ఫీచర్స్ చూస్తే 48మెగాపిక్సెల్ Samsung S5KGM1ST ప్రైమరీ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 33 వాట్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. (image: Realme India)