1. రియల్మీ ఇండియా భారతదేశంలో రియల్మీ నార్జో 50 సిరీస్‌లో (Realme Narzo 50 Series) మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రియల్మీ నార్జో 50 5జీ (Realme Narzo 50 5G), రియల్మీ నార్జో 50 ప్రో 5జీ (Realme Narzo 50 Pro 5G) మోడల్స్‌ని పరిచయం చేసింది. వీటిలో రియల్మీ నార్జో 50 5జీ సేల్ మే 24 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. (image: Realme India)
2. రియల్మీ నార్జో 50 సిరీస్‌లో ఇండియాలో రియల్మీ నార్జో 50ఏ, రియల్మీ నార్జో 50ఏ ప్రైమ్, రియల్మీ నార్జో 50ఐ, రియల్మీ నార్జో 50 4జీ మోడల్స్ ఉన్నాయి. మరో రెండు మొబైల్స్ ఇదే సిరీస్‌లో వచ్చాయి. దీంతో రియల్మీ నార్జో 50 సిరీస్‌లో ఆరు స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రియల్మీ నార్జో 50 ప్రో 5జీ మొబైల్ రూ.20,000 బడ్జెట్లో, రియల్మీ నార్జో 50 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.15,000 బడ్జెట్లో రిలీజైంది. (image: Realme India)
3. రియల్మీ నార్జో 50 5జీ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. ఇక హైఎండ్ వేరియంట్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999. అమెజాన్, రియల్మీ అఫీషియల్ వెబ్సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనొచ్చు. (image: Realme India)
4. తొలి సేల్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.13,999 ధరకు, 4జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.14,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.15,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. హైపర్ బ్లాక్, హైపర్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. (image: Realme India)
5. రియల్మీ నార్జో 50 5జీ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రియల్మీ 9, రెడ్మీ నోట్ 11టీ, వివో వీ23ఈ 5జీ, లావా అగ్ని 5జీ, రియల్మీ 8ఎస్ స్మార్ట్ఫోన్లలో ఉంది. (image: Realme India)
6. రియల్మీ నార్జో 50 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 48మెగాపిక్సెల్ అల్ట్రా హెచ్డీ మెయిన్ కెమెరా + మోనో క్రోమ్ పోర్ట్రైట్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో ఫోటో, వీడియో, నైట్స్కేప్, ప్రొఫెషనల్, పనోరమిక్, పోర్ట్రైట్, టైమ్ ల్యాప్స్, స్లోమోషన్, హైపర్ టెక్స్ట్, 48ఎంపీ, స్ట్రీట్ ఫోటోగ్రఫీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Realme India)
7. రియల్మీ నార్జో 50 5జీ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోటో, వీడియో, పనోరమిక్, పోర్ట్రైట్, నైట్స్కేప్, టైమ్ ల్యాప్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 33 వాట్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 + రియల్మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Realme India)
8. రియల్మీ నార్జో 50 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. ఇందులో డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో అదనంగా 5జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. మెమొరీ కార్డుతో స్టోరేజ్ 1టీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యూయెల్ 5జీ సపోర్ట్ ఉండటం విశేషం. (image: Realme India)