Realme Narzo 30A: రియల్మీ నార్జో 30A స్మార్ట్‌ఫోన్ కేవలం ధర రూ. 8,999 వద్ద లభిస్తోంది. దీన్ని Realme.com వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. రియల్మీ నార్జో 30A 6.5 అంగుళాల హెచ్‌డీప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది గరిష్టంగా 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. దీనిలో ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G85 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఇది 13- మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉన్న డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. యూఎస్బీ టైప్- సీ పోర్ట్ ద్వారా 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 6,000mAh బ్యాటరీతో వస్తుంది.
Micromax IN Note 1: మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌గా మైక్రోమ్యాక్స్ IN నోట్ 1 రిలీజైంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 9,999 ధర వద్ద లభిస్తుంది. దీన్ని మైక్రోమ్యాక్స్ అధికారిక వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది మీకు క్లీన్ ఆండ్రాయిడ్ 10 ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. ఇది మీడియా టెక్ హీలియో G80 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని వెనుక భాగంలో రెండు సెన్సార్లతో కూడిన 48- మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది.
Samsung Galaxy F02S: శామ్సంగ్ నుంచి విడుదలైన ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 9,499 వద్ద లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల హెచ్డీ ప్లస్ ఇన్ఫినిటీ- వి డిస్ప్లేతో వస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలోని ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది 6,000mAh బ్యాటరీతో వస్తుంది.
Motorola Moto G10 Power: మోటరోలా మోటో జీ10 పవర్ రూ. 9,999 ధర వద్ద లభిస్తుంది. ఇది 6.5 -అంగుళాల హెచ్డీ ప్లస్ మాక్స్ విజన్ డిస్ప్లేతో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G25 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ గల డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీనిలో 5,000mAh బ్యాటరీని చేర్చింది.
Redmi 9 Prime: రెడ్మీ 9 ప్రైమ్ రూ. 9,999 వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Mi.com అందుబాటులో ఉంది. ఇది 6.53 -అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది మీడియా టెక్ హీలిమో జీ80 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 13-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 5-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.
Infinix Hot 10S: ఇన్ఫినిక్స్ హీట్10S రూ. 9,999 వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.82-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. మీడియా టెక్ హీలియో G85 చిప్సెట్తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48 -మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్ కెమెరాను చేర్చింది.