1. రియల్మీ ఇటీవల మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. రియల్మీ నార్జో 30 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.15,999 ధరకే రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ జూన్ 30 మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్‌తో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ఆఫర్ కూడా ఉంది. (image: Realme India)
2. రియల్మీ నార్జో 30 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.15,999. ఇంట్రడక్టరీ సేల్ ఆఫర్లో భాగంగా రూ.500 తగ్గింపు లభిస్తుంది. అంటే మొదటి సేల్ ధర రూ.15,499 మాత్రమే. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. అంటే రూ.14,499 ధరకే ఈ ఫోన్ కొనొచ్చు. (image: Realme India)