రియల్‌మి జిటి నియో 3టి స్మార్ట్‌ఫోన్‌ను(Realme GT Neo 3T) ఆగస్టులోనే భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు రియల్మీ ఇండియా సిఇఒ మాధవ్ సేథ్ ధృవీకరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రియల్‌మి జిటి నియో 3టి స్మార్ట్‌ఫోన్‌ను(Realme GT Neo 3T) ఆగస్టులోనే భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు రియల్మీ ఇండియా సిఇఒ మాధవ్ సేథ్ ధృవీకరించారు. Realme 9i స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన తర్వాత.. Realme కొత్త GT నియో 3T స్మార్ట్‌ఫోన్ కోసం టీజర్‌ను విడుదల చేసింది.
2/ 6
Realme GT Neo 3T స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన టీజర్లు జూన్ నుండి విడుదలయ్యాయి. రెండు నెలలుగా ఎప్పటికప్పుడు టీజర్లు మాత్రమే విడుదలవుతుండగా.. ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. (image: Realme India)
3/ 6
ఇంతకుముందు రియల్మీ జిటి నియో 3టి స్మార్ట్‌ఫోన్ ఇండోనేషియా మార్కెట్లో విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే చైనీస్ మార్కెట్లో ప్రారంభించబడిన రియల్మే క్యూ5 ప్రో మోడల్‌కు రీబ్రాండెడ్ వెర్షన్. (image: Realme India)
4/ 6
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ మోడల్ 6.62 అంగుళాల FHD+120Hz AMOLED డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, LPDDR5 ర్యామ్, UFS 3.1 మెమరీ, ఆండ్రాయిడ్ 12 OS, 5000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వైర్డును కలిగి ఉంది.
5/ 6
దీనితో పాటు... ఫోటోలు తీయడానికి 64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP లెన్స్ అండ్ 16MP సెల్ఫీ కెమెరాలు ఈ ఫోన్లో లభిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
అంతే కాకుండా.. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, NFC మరియు USB టైప్-సి పోర్ట్ కూడా దీనిలో అందించబడ్డాయి. (ప్రతీకాత్మక చిత్రం)