1. ఇటీవల రియల్మీ ఇండియా రియల్మీ జీటీ సిరీస్‌లో (Realme GT Series) మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రియల్మీ జీటీ నియో 3 (Realme GT Neo 3) మోడల్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఎస్బీఐ కార్డుపై (SBI Card) ఏకంగా రూ.7,000 డిస్కౌంట్ లభిస్తోంది. (image: Realme India)
2. మిడ్‌రేంజ్, ఫ్లాగ్షిప్ సెగ్మెంట్లో రియల్మీ జీటీ స్మార్ట్‌ఫోన్స్ బాగా పాపులర్ అయ్యాయి. రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్, రియల్మీ జీటీ, రియల్మీ జీటీ నియో 2, రియల్మీ జీటీ 2, రియల్మీ జీటీ 2 ప్రో లాంటి మోడల్స్ ఇప్పటికే ఉన్నాయి. ఇటీవల ఫ్లాగ్షిప్ ఫీచర్స్‌తో రియల్మీ జీటీ నియో 3 వచ్చేసింది. (image: Realme India)
3. రియల్మీ జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్, 150వాట్ అల్ట్రాడార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. రియల్మీ జీటీ నియో 3 రెండు మోడల్స్ రిలీజ్ అయ్యాయి. 5,000ఎంఏహెచ్ బ్యాటరీకి 80వాట్ సూపర్‌డార్ట్ సపోర్ట్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు 150వాట్ అల్ట్రాడార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. (image: Realme India)
4. రియల్మీ జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.36,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.38,999. ఇక 150వాట్ అల్ట్రాడార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభించే 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.42,999. ఆస్ఫాల్ట్ బ్లాక్, నిట్రో బ్లూ, స్ప్రింట్ వైట్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Realme India)
5. రియల్మీ జీటీ నియో 3 సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎస్బీఐ కార్డుతో రూ.7,000 డిస్కౌంట్, రియల్మీ అధికారిక వెబ్సైట్లో ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులో రూ.7,000 డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్‌తో 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.29,999 ధరకు, 8జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.31,999 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.35,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: Realme India)
6. రియల్మీ జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ లేటెస్ట్గా ఇండియాలో రిలీజైన వన్‌ప్లస్ 10ఆర్ మోడల్లో కూడా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. (image: Realme India)
7. రియల్మీ జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50మెగాపిక్సెల్ Sony IMX766 సెన్సార్ + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. రియర్ కెమెరాలో సూపర్ నైట్స్కేప్, 50MP మోడ్, ప్రొఫెషనల్ మోడ్, పనోరమిక్ వ్యూ, పోర్ట్రైట్ మోడ్, HDR, అల్ట్రా వైడ్-యాంగిల్, టెక్స్ట్ స్కానర్, అల్ట్రా మాక్రో, స్ట్రీట్ ఫోటోగ్రఫీ మోడ్, AI బ్యూటీ, ఫిల్టర్స్, AI సీన్ రికగ్నిషన్, టిల్ట్-షిఫ్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Realme India)
8. రియల్మీ జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ Samsung S5K3P9 కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో పనోరమిక్ వ్యూ, పోర్ట్రైట్ మోడ్, సూపర్ నైట్స్కేప్, టైమ్-లాప్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వీడియోలో ఆటో వీడియో స్టెబిలైజేషన్, వీడియో బోకే, వీడియో బ్యూటీ, వీడియో ఫిల్టర్స్, స్లో-మోషన్, టైమ్-లాప్స్, AI నైట్స్కేప్ వీడియో, మూవీ మోడ్, డ్యూయల్-వ్యూ వీడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Realme India)
9. బ్యాటరీ విషయానికి వస్తే రియల్మీ జీటీ నియో 3 రెండు ఛార్జింగ్ వేరియంట్లలో లభిస్తుంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న 8జీబీ+128జీబీ, 12జీబీ+128జీబీ వేరియంట్లకు 80వాట్ సూపర్‌డార్ట్ సపోర్ట్ లభిస్తుంది. 32నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఇక 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న 12జీబీ+256జీబీ వేరియంట్‌కు 150వాట్ అల్ట్రాడార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. కేవలం 5 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేయొచ్చు. (image: Realme India)