1. రియల్మీ ఇండియా కొన్ని రోజుల క్రితం ఇండియాలో రియల్మీ జీటీ సిరీస్‌లో (Realme GT Series) రియల్మీ జీటీ నియో 3 (Realme GT Neo 3) ఫ్లాగ్షిప్ మోడల్‌ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే స్మార్ట్‌ఫోన్‌ను నరుటో ఎడిషన్ పేరుతో కొత్తగా పరిచయం చేసింది. కొత్త డిజైన్‌తో చైనాలో రియల్మీ జీటీ నియో 3 రిలీజైంది. (image: Realme)
2. జపనీస్ మంగా సిరీస్‌లో నరుటో ఓ క్యారెక్టర్. మసషి కిషిమోటో ఈ పాత్రను రూపొందించారు. నరుటో ఉజుమాకి కథను చెప్పే సిరీస్ ఇది. నరుటో క్యారెక్టర్‌కి ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు. వారిని ఆకట్టుకోవడం కోసం రియల్మీ నరుటో ఎడిషన్ మొబైల్ లాంఛ్ చేసింది. ఆరెంజ్ ఫినిష్ డిజైన్, డ్యూయెల్ టోన్ బ్యాక్‌తో ఈ డిజైన్ ఆకట్టుకుంటోంది. (image: Realme)
3. రియల్మీ జీటీ నియో 3 నరుటో ఎడిషన్ ప్రస్తుతం చైనాలో మాత్రమే రిలీజైంది. మొబైల్‌తో పాటు పవర్ బ్యాంక్ కూడా ఇదే థీమ్‌తో రిలీజైంది. రియల్మీ జీటీ నియో 3 నరుటో ఎడిషన్ ధర సుమారు రూ.35,600. ఈ ఎడిషన్ ఇండియాలో కూడా లాంఛ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రియల్మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ షేఠ్ ఇప్పటికే ఈ మొబైల్‌ను ట్వీట్ చేశారు. (image: Realme)
4. ఇండియాలోని రియల్మీ ఫ్యాన్స్‌ను కూడా ఆకట్టుకుంటున్న ఈ మొబైల్ భారతదేశంలో ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న క్లారిటీ లేదు. చైనాలో ఇప్పటికే ఎక్స్‌క్లూజీవ్ సేల్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఇండియాలో రియల్మీ జీటీ నియో 3 ఆస్ఫాల్ట్ బ్లాక్, నిట్రో బ్లూ, స్ప్రింట్ వైట్ కలర్స్‌లో లభిస్తోంది. ఇండియాలో ఇప్పటికే రియల్మీ జీటీ సిరీస్‌లో రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్, రియల్మీ జీటీ, రియల్మీ జీటీ నియో 2, రియల్మీ జీటీ 2, రియల్మీ జీటీ 2 ప్రో లాంటి మోడల్స్ ఇప్పటికే ఉన్నాయి. (image: Realme)
6. రియల్మీ జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ లేటెస్ట్గా ఇండియాలో రిలీజైన వన్‌ప్లస్ 10ఆర్ మోడల్లో కూడా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. (image: Realme India)
7. రియల్మీ జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50మెగాపిక్సెల్ Sony IMX766 సెన్సార్ + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ Samsung S5K3P9 కెమెరా ఉంది. (image: Realme India)
8. బ్యాటరీ విషయానికి వస్తే రియల్మీ జీటీ నియో 3 రెండు ఛార్జింగ్ వేరియంట్లలో లభిస్తుంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న 8జీబీ+128జీబీ, 12జీబీ+128జీబీ వేరియంట్లకు 80వాట్ సూపర్‌డార్ట్ సపోర్ట్ లభిస్తుంది. 32నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఇక 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న 12జీబీ+256జీబీ వేరియంట్‌కు 150వాట్ అల్ట్రాడార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. కేవలం 5 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేయొచ్చు. (image: Realme India)