1. రియల్మీ నాలుగో యానివర్సరీ సేల్ సందర్భంగా ఇటీవల ఇండియాలో రియల్మీ జీటీ 2 (Realme GT 2) స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. కొద్ది రోజుల క్రితం రియల్మీ జీటీ 2 ప్రో (Realme GT 2 Pro) మోడల్ రిలీజైన సంగతి తెలిసిందే. ఇదే సిరీస్‌లో రియల్మీ జీటీ 2 మొబైల్ ఇండియాకు వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై తొలి సేల్‌లోనే ఏకంగా రూ.5,000 ఫ్లాట్ డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. (image: Realme India)
2. రియల్మీ జీటీ 2 స్మార్ట్‌ఫోన్‌లో 6.62 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఈ4 అమొలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, బయో బేస్డ్ పాలిమర్ పేపర్ టెక్ మాస్టర్ డిజైన్ లాంటి ప్రత్యేకతలున్నాయి. హైఎండ్ ఫీచర్స్‌తో రూ.35,000 లోపు సెగ్మెంట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. (image: Realme India)
3. రియల్మీ జీటీ 2 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.38,999. రియల్మీ ఇండియా నాలుగో యానివర్సరీ సేల్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుతో కొంటే రూ.5,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. (image: Realme India)
4. ఈ డిస్కౌంట్‌తో 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.29,999 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.33,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఏప్రిల్ 28 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది. రియల్మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. పేపర్ వైట్, స్టీల్ బ్లాక్, పేపర్ గ్రీన్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Realme India)
5. ఫ్లిప్‌కార్ట్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుతో కొంటే రూ.5,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం, కొటక్ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. (image: Realme India)
6. రియల్మీ జీటీ 2 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.62 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సాంసంగ్ ఈ4 అమొలెడ్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఏసుస్ 8జెడ్, ఐకూ 9 ఎస్ఈ, వన్‌ప్లస్ 9ఆర్టీ లాంటి స్మార్ట్ఫోన్లలో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. (image: Realme India)
7. రియల్మీ జీటీ 2 స్మార్ట్‌ఫోన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 మెగాపిక్సెల్ Sony IMX776 ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో 50MP మోడ్, స్ట్రీట్ ఫోటోగ్రఫీ మోడ్, సూపర్ నైట్స్కేప్, ఎక్స్పర్ట్, పనోరమిక్ వ్యూ, బోకె, హెచ్‌డిఆర్, అల్ట్రా వైడ్ యాంగిల్, ఏఐ సీన్ రికగ్నిషన్, ఏఐ బ్యూటీ, ఫిల్టర్లు, టెక్స్ట్ స్కానర్, పోర్ట్రైట్ డిస్టార్షన్ కరెక్షన్, టిల్ట్-షిఫ్ట్, స్టారీ మోడ్, డైనమిక్ బొకే పోర్ట్రైట్, బొకే ఫ్లేర్ పోర్ట్రైట్, అల్ట్రా మ్యాక్రో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Realme India)
8. రియల్మీ జీటీ 2 స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ SONY IMX471 ఫ్రంట్ కెమెరా ఉంది. సెల్ఫీ కెమెరాలో పోర్ట్రైట్ బోకె, టైమ్-లాప్స్, పనోరమిక్ వ్యూ, బ్యూటీ, హెచ్‌డిఆర్, ఫేస్ రికగ్నిషన్, ఫిల్టర్స్, సూపర్ నైట్స్కేప్, బోకె అడ్జస్ట్మెంట్, పోర్ట్రైట్ డిస్టార్షన్ కరెక్షన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Realme India)