1. రియల్మీ ఇండియా నుంచి ఇటీవల మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కొంతకాలం క్రితం చైనాలో, యూరప్ మార్కెట్లో రిలీజ్ అయిన రియల్మీ జీటీ 2 ప్రో (Realme GT 2 Pro) మోడల్‌ను భారతదేశంలో పరిచయం చేసింది రియల్మీ ఇండియా. ఇప్పటికే రియల్మీ జీటీ సిరీస్‌లో (Realme GT Series) రియల్మీ జీటీ నియో 2, రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్, రియల్మీ జీటీ 5జీ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. (image: Realme India)
2. రియల్మీ జీటీ సిరీస్‌లో నాలుగో స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జన్ 1 చిప్సెట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇందులో ప్రపంచంలోనే మొదటి 2కే LTPO 2.0 ఫ్లాట్ డిస్ప్లే, ప్రపంచంలోనే మొదటి 150డిగ్రీల అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 1,007,765 AnTuTu బెంచ్‌మార్క్ స్కోర్ లాంటి ప్రత్యేకతలు ఉన్నట్టు కంపెనీ చెబుతోంది. (image: Realme India)
3. రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ కావడంతో ఫీచర్స్ తెలిసినవే. అయితే ఇండియాలో ఎంత ధరకు రిలీజ్ అవుతుందన్న ఆసక్తి రియల్మీ ఫ్యాన్స్‌లో కనిపించింది. రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజ్ అంయింది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.57,999. (image: Realme India)
4. రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే రూ.5,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.44,999 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.52,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: Realme India)
5. ఫ్లిప్‌కార్ట్‌లో పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేసేవారికి అదనంగా రూ.4,000 అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో కలిపి మొత్తం రూ.9,000 తగ్గింపు పొందొచ్చు. ఈ రెండు ఆఫర్స్‌తో రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.40,999 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.48,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: Realme India)
6. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి రూ.4,167 నుంచి ఈఎంఐ ప్రారంభం అవుతుంది. రియల్మీ జీటీ 2 ప్రో సేల్ ఏప్రిల్ 14 మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. తొలి సేల్‌లోనే ఈ స్మార్ట్‌ఫోన్ కొనేవారికి రూ.4,999 విలువైన రియల్మీ వాచ్ ఎస్ ఉచితంగా లభిస్తుంది. (image: Realme India)
7. రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల 2కే LTPO అమొలెడ్ డిస్ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ వన్‌ప్లస్ 10ప్రో, ఐకూ 9 ప్రో, మోటో ఎడ్జ్ 30 ప్రో, సాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ స్మార్ట్ఫోన్లలో ఉంది. (image: Realme India)
8. రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ఇందులో 50 మెగాపిక్సెల్ Sony IMX 766 ప్రైమరీ సెన్సార్ + 50మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో 50ఎంపీ మోడ్, స్ట్రీట్ ఫోటోగ్రఫీ మోడ్, సూపర్ నైట్స్కేప్, పనోరమిక్ వ్యూ, బొకే, హెచ్‌డిఆర్, 150 డిగ్రీల అల్ట్రా వైడ్ యాంగిల్, ఫిష్-ఐ మోడ్, AI సీన్ రికగ్నిషన్, AI బ్యూటీ, ఫిల్టర్, ఎక్స్పర్ట్, టెక్స్ట్ స్కానర్, పోర్ట్రెయిట్ డిస్టార్షన్ కరెక్షన్, స్టార్రిల్ట్-షిఫ్ట్ , డైనమిక్ బొకే పోర్ట్రెయిట్, బొకే ఫ్లేర్ పోర్ట్రెయిట్, మైక్రోస్కోప్, 3D ఫోటో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Realme India)
9. రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ SONY IMX615 సెల్ఫీ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో పోర్ట్రెయిట్ బోకె, టైమ్-లాప్స్, పనోరమిక్ వ్యూ, బ్యూటీ, హెచ్‌డిఆర్, ఫేస్ రికగ్నిషన్, ఫిల్టర్లు, సూపర్ నైట్స్కేప్, బోకె అడ్జస్ట్మెంట్, పోర్ట్రెయిట్ డిస్టార్షన్ కరెక్షన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Realme India)
10. రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + రియల్మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 65వాట్ సూపర్‌డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 33నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. ఇది 5జీ స్మార్ట్‌ఫోన్. పేపర్ వైట్, పేపర్ గ్రీన్, స్టీల్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Realme India)