1. ఆన్లైన్ క్లాసుల కోసం ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా? వీకెండ్లో సినిమాలు చూసేందుకు, వీడియో గేమ్స్ ఆడేందుకు మంచి ట్యాబ్ కోసం చూస్తున్నారా? రియల్మీ తొలి ట్యాబ్లెట్ను ఇండియాలో రిలీజ్ చేసింది. రియల్మీ ప్యాడ్ (Realme Pad) పేరుతో ఈ ట్యాబ్లెట్ను ఇండియాకు ఇటీవల పరిచయం చేసింది. (image: Realme India)
3. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ కోర్సులకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో మంచి ట్యాబ్లెట్ కొనాలని చూస్తున్నవారు ఎక్కువ. అంతేకాదు... వీకెండ్లో ఎంటర్టైన్మెంట్ కోసం ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారు. ఇలాంటివారిని టార్గెట్ చేస్తూ రియల్మీ ట్యాబ్ను పరిచయం చేసింది. (image: Realme India)