1. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో బడ్జెట్ స్మార్ట్ఫోన్లపై (Budget Smartphones) భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. అన్ని బ్రాండ్లు రూ.10,000 లోపు మొబైల్స్‌పై పోటాపోటీగా డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. రియల్మీ ఇండియా ఇటీవల రిలీజ్ చేసిన రియల్మీ సీ30ఎస్ (Realme C30s) బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్స్‌తో రూ.6,250 ధరకు కొనొచ్చు. (image: Realme India)
2. రియల్మీ ఇండియా ఎంట్రీలెవెల్ సెగ్మెంట్లో రియల్మీ సీ30ఎస్ మొబైల్‌ను తీసుకొచ్చింది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ అయినా డిజైన్ అద్భుతంగా ఉంది. రియల్మీ సీ30ఎస్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499 కాగా, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999. (image: Realme India)
4. రియల్మీ సీ30ఎస్ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. UNISOC SC9863A ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. టెక్నో పాప్ 5 ఎల్టీఈ, ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 5 ప్రో, ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 6, రియల్మీ నార్జో 50ఐ లాంటి మొబైల్స్‌లో ఇదే ప్రాసెసర్ ఉంది. (image: Realme India)
5. రియల్మీ సీ30ఎస్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + రియల్మీ యూఐ గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 4జీబీ వరకు ర్యామ్, 64జీబీ వరకు స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, డ్యూయెల్ సిమ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Realme India)
6. రియల్మీ సీ30ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో 8మెగాపిక్సెల్ ఏఐ ప్రైమరీ కెమెరా ఉంది. కెమెరాలో బ్యూటీ ఫిల్టర్, హెచ్డీఆర్, పనోరమిక్ వ్యూ, పోర్ట్రైట్, టైమ్‌ల్యాప్స్, ఎక్స్పర్ట్ మోడ్, సూపర్ నైట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఏఐ కెమెరా ఉంది. బ్యూటీ ఫిల్టర్, హెచ్డీఆర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Realme India)
7. ఇటీవల రియల్మీ నార్జో 50ఐ ప్రైమ్ మొబైల్ రిలీజైంది. ప్రారంభ ధర రూ.7,999. ఇందులో 6.5 అంగుళాల డిస్ప్లే, Unisoc T612 ప్రాసెసర్, 8మెగాపిక్సెల్ ఏఐ కెమెరా, 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు అదే బడ్జెట్లో రియల్మీ సీ30ఎస్ మొబైల్ రిలీజైంది. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇప్పటికే రూ.10,000 లోపు బడ్జెట్లో అనేక ఆప్షన్స్ ఉన్నాయి. ఇదే సెగ్మెంట్లో రియల్మీ పోటాపోటీగా మొబైల్స్ రిలీజ్ చేస్తోంది. (image: Realme India)