1. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) ప్రారంభమైంది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు మాత్రమే కాదు ల్యాప్‌టాప్‌ల పైనా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. రియల్మీ ఇండియా నుంచి గతేడాది రియల్మీ బుక్ స్లిమ్ పేరుతో తొలి ల్యాప్‌టాప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ల్యాప్‌టాప్‌పై ఏకంగా రూ.17,000 డిస్కౌంట్ లభిస్తోంది. (image: Realme India)
2. రియల్మీ బుక్ స్లిమ్ రెండు వేరియంట్లలో రిలీజైంది. ఇంటెల్ కోర్ ఐ3 చిప్సెట్తో రిలీజైన ల్యాప్‌టాప్ ధర రూ.44,999 కాగా, ఇంటెల్ కోర్ ఐ5 చిప్సెట్తో రిలీజైన మోడల్ ధర రూ.56,999. ఇప్పుడు ఈ ల్యాప్‌టాప్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ.30,990 ధరకే లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్స్‌తో కలిపి కేవలం రూ.27,990 ధరకే ఈ ల్యాప్‌టాప్ కొనొచ్చు. (image: Realme India)
3. రూ.30,000 లోపే మంచి ఫీచర్స్ ఉన్న ల్యాప్‌టాప్ లభిస్తుండటం విశేషం. మొదటిసారి ల్యాప్‌టాప్ కొనాలనుకునేవారికి, ఆన్లైన్ కోర్సులు, వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఈ బేసిక్ ల్యాప్‌టాప్ బాగుంటుంది. ప్రస్తుతం రియల్మీ బుక్ స్లిమ్ ఇంటెల్ కోర్ ఐ3 వేరియంట్ రూ.30,990 ధరకు, ఇంటెల్ కోర్ ఐ5 వేరియంట్ రూ.41,990 ధరకు కొనొచ్చు. (image: Realme India)
4. రియల్మీ బుక్ స్లిమ్ ల్యాప్‌టాప్ ఫీచర్స్ చూస్తే ఇందులో 14 అంగుళాల 2కే ఫుల్ విజన్ ఐపీఎస్ డిస్ప్లే ఉంది. మెటల్ బాడీతో 90శాతం స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. భారతదేశంలో తక్కువ బరువుతో లభిస్తున్న స్లిమ్ ల్యాప్‌టాప్ ఇదేనని కంపెనీ చెబుతోంది. సేఫ్టీ కోసం పవర్ బటన్‌లోనే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండటం విశేషం. (image: Realme India)
5. రియల్మీ బుక్ స్లిమ్ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ ఐ3 వేరియంట్లో 8జీ ర్యామ్, 256జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ ఉంటే, ఇంటెల్ కోర్ ఐ5 వేరియంట్లో 8జీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ లభిస్తుంది. Iris XE ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో డీటీఎస్ ఆడియో సపోర్ట్‌తో రెండు హర్మాన్ స్పీకర్స్ ఉన్నాయి. డ్యూయెల్ ఫ్యాన్ స్టార్మ్ కూలింగ్ సిస్టమ్ ఉంది. (image: Realme India)
6. రియల్మీ బుక్ స్లిమ్ ల్యాప్‌టాప్‌లో థండర్‌బోల్ట్ ఇంటెల్ కోర్ ఐ5 వర్షన్‌కు 4 పోర్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. 65వాట్ ఛార్జర్‌తో 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. పూర్తిగా రీఛార్జ్ చేస్తే 11 గంటలపాటు ల్యాప్‌టాప్ ఉపయోగించవచ్చని కంపెనీ చెబుతోంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2019 సపోర్ట్‌తో విండోస్ 10 హోమ్ ఎడిషన్ ప్రీలోడెడ్‌గా వస్తుంది. విండోస్ 11 కి ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. (image: Realme India)
7. రియల్మీ బుక్ స్లిమ్ ల్యాప్‌టాప్‌లో కనెక్టివిటీ కోసం WiFi-6 టెక్నాలజీ సపోర్ట్ ఉంది. ఈ టెక్నాలజీ ఇంటెల్ కోర్ ఐ5 వర్షన్‌కు మాత్రమే లభిస్తుంది. ఇంటెల్ కోర్ ఐ3 వర్షన్‌కు WiFi-5 టెక్నాలజీ సపోర్ట్ ఉంది.విండోస్, ఆండ్రాయిడ్ మధ్య క్రాస్ కనెక్ట్ ఫీచర్ కూడా ఉంది. బాక్సులో ల్యాప్‌టాప్, పవర్ అడాప్టర్ లభిస్తాయి. రియల్ బ్లూ, రియల్ గ్రే కలర్స్‌లో కొనొచ్చు. (image: Realme India)