1. రియల్మీ 9 ప్రో (Realme 9 Pro), రియల్మీ 9 ప్రో+ (Realme 9 Pro+) మోడల్స్ ఇటీవల రిలీజ్ అయ్యాయి. వీటిలో రియల్మీ 9 ప్రో+ స్మార్ట్‌ఫోన్ స్పెషల్ ఫీచర్స్‌తో రిలీజైంది. ఇందులో 50MP Sony IMX766 కెమెరా సెటప్ ఉండటం విశేషం. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో హార్ట్ రేట్ సెన్సార్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ఫిబ్రవరి 21 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. (image: Realme India)
2. రియల్మీ 9 ప్రో+ మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ ఉంది. ఇదే ప్రాసెసర్‌తో కొద్ది రోజుల క్రితం షావోమీ 11ఐ, షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ స్మార్ట్ఫోన్లు రిలీజ్ అయ్యాయి. గతంలో రిలీజైన వివో వీ23 మోడల్లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. ఇప్పుడు రియల్మీ 9 ప్రో+ స్మార్ట్‌ఫోన్ కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌తో వచ్చింది. (image: Realme India)
3. రియల్మీ 9 ప్రో+ మూడు వేరియంట్లలో రిలీజ్ అయింది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999. ఫ్లిప్‌కార్ట్, రియల్మీ ఆన్లైన్ స్టోర్‌లో కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో రియల్మీ 9 ప్రో+ స్మార్ట్‌ఫోన్ కొనేవారికి అనేక ఆఫర్స్ ఉన్నాయి. (image: Realme India)
4. ఫ్లిప్‌కార్ట్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో కొంటే రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూజర్లకు అదనంగా రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. రియల్మీ 9 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ 6జీబీ+128జీబీ ధర రూ.24,999 కాగా, ఆఫర్లతో రూ.21,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. (image: Realme India)
5. రియల్మీ 9 ప్రో+ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉండటం విశేషం. మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 + రియల్మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Realme India)
6. రియల్మీ 9 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50మెగాపిక్సెల్ Sony IMX766 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో 50మెగాపిక్సెల్ మోడ్, అల్ట్రా స్టడీ వీడియో, నైట్ మోడ్, పనోరమిక్ వ్యూ, ఎక్స్పర్ట్, టైమ్‌ల్యాప్స్, పోర్ట్రైట్ మోడ్, హెచ్డీఆర్ అల్ట్రా వైడ్, అల్ట్రా మ్యాక్రో, ఏఐ సీన్ రికగ్నిషన్, ఏఐ బ్యూటీ, ఫిల్టర్, క్రోమా బూస్ట్, స్లో మోషన్, బొకే ఎఫెక్ట్ కంట్రోల్, మూవీ, డ్యూయెల్ వ్యూ వీడియో, టెక్స్ట్ స్కానర్, స్టారీ మోడ్, టిల్ట్ షిఫ్ట్, స్ట్రీట్ ఫోటోగ్రఫీ 2.0 ఫీచర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Realme India)
7. రియల్మీ 9 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో బ్యూటీ ఫిల్టర్స్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరాలో అల్ట్రా స్టెడీ వీడియో, పోర్ట్రైట్ మోడ్, టైమ్‌ల్యాప్స్, పనోరమిక్ వ్యూ, బ్యూటీ మోడ్, హెచ్డీఆర్, ఫేస్ రికగ్నిషన్, ఫిల్టర్, నైట్ మోడ్, బొకే ఎఫెక్ట్ కంట్రోల్, స్ట్రీట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Realme India)
8. రియల్మీ 9 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 60వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్‌తో 15 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ అవుతుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో హార్ట్ రేట్ సెన్సార్ ఉంది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ హార్ట్ రేట్ చెక్ చేసుకోవచ్చు. డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. అరోరా గ్రీన్, మిడ్నైట్ బ్లాక్, సన్‌రైజ్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. (image: Realme India)