1. రియల్మీ 9 సిరీస్‌లో (Realme 9 Series) కొద్ది రోజుల క్రితం రియల్మీ 9 ప్రో (Realme 9 Pro), రియల్మీ 9 ప్రో ప్లస్ (Realme 9 Pro Plus) స్మార్ట్ఫోన్లు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ రెండు స్మార్ట్ఫోన్లు ఆన్లైన్ మార్కెట్లతో పాటు ఆఫ్‌లైన్ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో రియల్మీ 9 ప్రో మొబైల్‌పై తొలిసారి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. (image: Realme India)
2. రియల్మీ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే రూ.1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో పాటు రూ.1,500 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అదనంగా లభిస్తోంది. (image: Realme India)
3. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్ కలిపి మొత్తం రూ.2,500 డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్స్‌తో రియల్మీ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.15,499 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.18,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. (image: Realme India)
4. రియల్మీ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ ఐకూ జెడ్6, రెడ్మీ నోట్ 11 ప్రో+, వివో టీ1, మోటో జీ71 స్మార్ట్ఫోన్లలో కూడా ఉంది. ఆండ్రాయిడ్ 12 + రియల్మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Realme India)
5. రియల్మీ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. రియల్మీ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో డైనమిక్ ర్యామ్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో 5జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయెల్ స్పీకర్స్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Realme India)
6. రియల్మీ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 64మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో 64మెగాపిక్సెల్ మోడ్, నైట్ మోడ్, పనోరమిక్ వ్యూ, ఎక్స్పర్ట్, పోర్ట్రైట్ మోడ్, హెచ్డీఆర్, అల్ట్రావైడ్, అల్ట్రా మ్యాక్రో, ఏఐ సీన్ రికగ్నిషన్, ఏఐ బ్యూటీ, ఫిల్టర్, బొకే, ఎఫెక్ట్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Realme India)
7. రియల్మీ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. సెల్ఫీ కెమెరాలో పోర్ట్రైట్ మోడ్, పనోరమిక్ వ్యూ, బ్యూటీ మోడ్, హెచ్డీఆర్, ఫేస్ రికగ్నిషన్, ఫిల్టర్, నైట్ మోడ్, బొకే ఎఫెక్ట్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మిడ్నైట్ బ్లాక్, అరోరా గ్రీన్, సన్‌రైజ్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. (image: Realme India)