1. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే చాలావరకు స్మార్ట్‌ఫోన్స్, ఇతర ప్రొడక్ట్స్ సేల్ ధరలకే లభిస్తున్నాయి. అందులో రియల్మీ నుంచి విడుదలైన గేమింగ్ స్మార్ట్‌ఫోన్ రియల్మీ 9 5జీ స్పీడ్ ఎడిషన్ (Realme 9 5G SE) రూ.5,000 డిస్కౌంట్‌తో లభిస్తోంది. (image: Realme India)
2. రియల్మీ 9 సిరీస్‌లో రియల్మీ 9 5జీ స్పీడ్ ఎడిషన్ ఆరు నెలల క్రితం రిలీజైంది. రెండు వేరియంట్లలో లభిస్తోంది. అసలు ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999. ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్‌ను కేవలం రూ.14,999 ధరకే కొనొచ్చు. (image: Realme India)
3. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొనేవారికి ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. గరిష్టంగా రూ.5,000 వరకు తగ్గింపు పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ ద్వారా కొనేవారికి రూ.19,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి ఈఎంఐ ఆప్షన్ రూ.694 నుంచి మొదలవుతుంది. అజ్యూర్ గ్లో, స్టారీ గ్లో కలర్స్‌లో కొనొచ్చు. (image: Realme India)
4. సెప్టెంబర్ 30న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసేవరకు ఈ ఆఫర్స్ పొందొచ్చు. ఇదేకాదు, ఇతర రియల్మీ స్మార్ట్ఫోన్లపైనా డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. రూ.14,999 ధరకు రియల్మీ 9 ప్రో 5జీ, రూ.12,999 ధరకు రియల్మీ 9, రూ.10,999 ధరకు రియల్మీ 9ఐ, రూ.12,999 ధరకు రియల్మీ 9 5జీ, రూ.26,999 ధరకు రియల్మీ జీటీ 2 మొబైల్స్ కొనొచ్చు. (image: Realme India)
5. రియల్మీ 9 ఎస్ఈ ఫీచర్స్ చూస్తే 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇండియాలో బాగా పాపులర్ అయిన 5జీ ప్రాసెసర్ ఇది. ఇదే ప్రాసెసర్‌తో చాలా ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ఐకూ జెడ్6 ప్రో, వివో టీ1 ప్రో, సాంసంగ్ గెలాక్సీ ఎం52, షావోమీ 11 లైట్ ఎన్ఈ, మోటోరోలా ఎడ్జ్ 20 స్మార్ట్ఫోన్లలో ఇదే ప్రాసెసర్ ఉంది. (image: Realme India)
6. రియల్మీ 9 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌లో డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉంది. 5జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. అంటే గరిష్టంగా 13జీబీ వరకు ర్యామ్ ఉపయోగించుకోవచ్చు. గేమ్స్ ఎక్కువగా ఆడేవారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ 11 + రియల్మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 5జీ నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది. (image: Realme India)
7. రియల్మీ 9 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 48మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 2మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30వాట్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. (image: Realme India)