రియల్మీ 9 5జీ సిరీస్ ఎట్టకేలకు భారత్‌కు రాబోతోంది. ఈ సిరీస్ నుంచి రియల్మీ 9 5G, రియల్మీ 9 SE 5G స్మార్ట్ఫోన్లు రాబోతున్నాయి. వీటిని భారత మార్కెట్లో మార్చి 10 మధ్యాహ్నం 12.30 గంటలకు ఆవిష్కరించనుంది. రియల్మీ ఎస్ఈ 5జీ కంపెనీ ఫోన్ లైనప్‌లో మొదటి “SE” ఫోన్‌గా రికార్డుకెక్కనుంది. మరోవైపు, రియల్మీ 9 5G మొత్తం రియల్మీ 9 సిరీస్‌లో మార్క్యూ ఫోన్‌గా రానుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో రియల్మీ 9i లాంచ్ అయ్యింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఆ తరువాత రియల్మీ 9 ప్రో, రియల్మీ 9 ప్రో ప్లస్ ఫోన్లు విడుదలయ్యాయి. అయితే, వీటిలో 5జీ సపోర్ట్ లేదు. ఇప్పుడు వీటి సరసన రియల్మీ 9 5జీ, రియల్మీ 9 ఎస్ఈ 5జీ ఫోన్లు చేరనున్నాయి. తద్వారా, రియల్మీ 9 సిరీస్‌ను మరింత విస్తరించనుంది కంపెనీ. అయితే, వీటి డిజైన్ మాత్రం రియల్మీ 8 సిరీస్‌ను పోలి ఉంటుంది. ఇక, కెమెరా బంప్లోని 4 హోల్ డిజైన్‌లో కొన్ని మార్పులు చేయనుంది. ఈ రెండు ఫోన్లలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్లు కూడా ఉండనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
డిజైన్ ఎలా ఉంటుంది?
కాగా, ఈ వారంలోనే వీటికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లను వెల్లడి కానున్నాయి. ఈ రెండు ఫోన్లలో ఉండే ఫీచర్లపై ఇప్పటికే అనేక లీకులొస్తున్నాయి. రియల్మీ 9 5G నాలుగు కలర్ వేరియంట్లలో లభిస్తుందని లీకేజీలను బట్టి తెలుస్తుంది. ఈ ఫోన్ స్టార్‌గేజ్ వైట్, సూపర్సోనిక్ బ్లూ, సూపర్సోనిక్ బ్లాక్, మెటోర్ బ్లాక్ కలర్లలో లభించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)