Realme 7 Pro: రియల్మీ గత నెలలో రియల్మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది. భారీ స్పెసిఫికేషన్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియల్మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో Sony IMX682 సెన్సార్‌తో 64+8+2+2 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఉండగా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: Realme India)
Realme 7 Pro: రియల్మీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 65వాట్ సూపర్ డార్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 34 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయొచ్చు. రియల్మీ 7 ప్రో మిర్రర్ సిల్వర్, మిర్రర్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.21,999. (image: Realme India)
Redmi 9A: రూ.7,000 లోపు ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్‌ను దృష్టిలో పెట్టుకొని షావోమీ ఇండియా తక్కువ ధరలో రెడ్మీ 9ఏ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. ఇందులో 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. రెడ్మీ 9ఏ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.53 అంగుళాల హెచ్డీ+ డాట్ డ్రాప్ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
Redmi 9A: రెడ్మీ 9ఏ రియర్ కెమెరా 13 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్. రెడ్మీ 9ఏ బ్యాటరీ 5000ఎంఏహెచ్. 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెడ్మీ 9ఏ ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్నైట్ బ్లాక్, నేచర్ గ్రూన్, సీ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. రెడ్మీ 9ఏ 2జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.6,799 కాగా 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.7,499. (image: Redmi India)
Realme 7: రియల్మీ 7 కూడా గత నెలలో రిలీజైంది. ఇందులో 64 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ డార్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉండటం విశేషం. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Realme India)
Realme 7: రియల్మీ 7 రియర్ కెమెరా 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా కాగా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. బ్యాటరీ కెపాసిటీ 5000ఎంఏహెచ్. 30వాట్ డార్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 64 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ 10 + రియల్మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రియల్మీ 7 స్మార్ట్‌ఫోన్ మిస్ట్ వైట్, మిస్ట్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,999. (image: Realme India)
Samsung Galaxy M51: సాంసంగ్ గెలాక్సీ ఎం51 ఇటీవల రిలీజైంది. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.7 అంగుళాల సూపర్ అమొలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా చూస్తే Sony IMX682 సెన్సార్‌తో 64+5+12+5 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, ఫ్రంట్‌లో Sony IMX616 సెన్సార్‌తో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం విశేషం.
Poco M2: పోకో ఎం2 రియర్ కెమెరా 13+8+5+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. బ్యాటరీ 5,000ఎంఏహెచ్. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్సులో 10 వాట్ ఛార్జర్ మాత్రమే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను పిచ్ బ్లాక్, స్లేట్ బ్లూ, బ్రిక్ రెడ్ కలర్స్‌లో కొనొచ్చు. 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.10,999 కాగా 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.12,499. (image: Poco India)
Redmi 9i: రెడ్మీ 9 సిరీస్‌లో రెడ్మీ 9ఐ మోడల్ కొద్ది రోజుల క్రితం పరిచయమైంది. మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్ బాక్సులోనే ఉంటుంది. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.53 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
Redmi 9i: రెడ్మీ 9 రియర్ కెమెరా 13 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్. బ్యాటరీ 5,000ఎంఏహెచ్. 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెడ్మీ 9ఐ ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో డ్యూయెల్ సిమ్ + ఎస్డీ కార్ట్ స్లాట్ ఉంటుంది. రెడ్మీ 9ఐ మిడ్నైట్ బ్లాక్, సీ బ్లూ, నేచర్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.8,299 కాగా, 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.9,299. (image: Redmi India)
Infinix Note 7: హాంకాంగ్‌కు చెందిన ట్రాన్సియన్ హోల్డింగ్స్ ఇన్ఫీనిక్స్ నోట్ 7 మోడల్ని ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది. 6.95 అంగుళాల పెద్ద డిస్ప్లే, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, ఆక్టాకోర్ ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.95 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.
Infinix Note 7: ఇన్ఫీనిక్స్ నోట్ 7 మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 48+2+2 మెగాపిక్సెల్+ఏఐ లెన్స్ కాగా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. బ్యాటరీ 5,000ఎంఏహెచ్. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఏథర్ బ్లాక్, బొలీవియా బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ కలర్స్‌లో కొనొచ్చు. ధర రూ.11,499.
Poco X3: పోకో ఎక్స్2 అప్‌గ్రేడ్ వర్షన్ పోకో ఎక్స్3 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది పోకో ఇండియా. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్, 6000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల పుల్ హెచ్డీ+ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Poco India)
Poco X3: పోకో ఎక్స్3 రియర్ కెమెరా వివరాలు చూస్తే 64 మెగాపిక్సెల్ Sony IMX 682 సెన్సార్ + 13 (అల్ట్రావైడ్)+2 (మ్యాక్రో)+2 (డెప్త్) మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఉండటం విశేషం. 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ 6000ఎంఏహెచ్. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. షాడో గ్రే, కోబాల్ట్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.16,999 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.18,499. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.19,999. (image: Poco India)
Realme Narzo 20 Pro: ఇటీవల రియల్మీ నార్జో 20 ప్రో రిలీజైంది. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+, 90Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే ఉంది. 6జీబీ+64జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లో రిలీజైంది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 48+8+2+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. (image: Realme India)
Realme Narzo 20 Pro: రియల్మీ నార్జో 20 ప్రో బ్యాటరీ 4500ఎంఏహెచ్ బ్యాటరీ. 65వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 38 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10 + రియల్మీ యూఐ. రియల్మీ నార్జో 20 ప్రో వైట్ నైట్, బ్లాక్ నిన్జా కలర్స్‌లో లభిస్తుంది. 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,999. (image: Realme India)
Realme Narzo 20A: రియల్మీ నార్జో 20ఏ బ్యాటరీ 5,000ఎంఏహెచ్. 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గ్లోరీ సిల్వర్, విక్టరీ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. రియల్మీ నార్జో 20ఏ స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.8,499 కాగా, 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,499. (image: Realme India)
Realme Narzo 20: రియల్మీ నార్జో 20 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల హెచ్డీ+ మినీ డ్రాప్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే ఉంది. 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 48+8+2 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. (image: Realme India)
Realme Narzo 20: రియల్మీ నార్జో 20 స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ 6,000ఎంఏహెచ్. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 10 + రియల్మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. గ్లోరీ సిల్వర్, విక్టరీ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.10,499 కాగా 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.11,499. (image: Realme India)
Motorola E7 Plus: లెనోవోకు చెందిన మోటోరోలా ఇండియాలో చాలాకాలం తర్వాత ఈ సిరీస్‌లో మోటోరోలా ఈ7 ప్లస్ రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో లేటెస్ట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. మోటోరోలా ఈ7 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా ఉంటుంది. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5హెచ్డీ+ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Motorola India)
Motorola E7 Plus: మోటోరోలా ఈ7 ప్లస్ రియర్ కెమెరా వివరాలు చూస్తే 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. మోటోరోలా ఈ7 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మోటోరోలా ఈ7 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. ఇందులో గూగుల్ యాప్స్ మాత్రమే ఉంటాయి. మోటోరోలా ఈ7 ప్లస్ స్మార్ట్‌ఫోన్ మిస్టీ బ్లూ, ట్విలైట్ ఆరెంజ్ కలర్స్‌లో లభిస్తుంది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,499.