స్పెసిఫికేషన్స్
రియల్మీ 10 ప్రో ఒక మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్‌ఫోన్. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD AMOLED డిస్ప్లేతో, స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ ద్వారా బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించనుంది. గరిష్టంగా 12GB RAM+ 256GB స్టోరేజ్ కెపాసిటీతో ఈ మోడల్ లభించనుంది. స్టోరేజ్ కెపాసిటీని మరింత పెంచుకునేందుకు కూడా వీలు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13-బేస్డ్ రియల్మీ UI 4.0 ఓఎస్‌పై ఈ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. మెయిన్ కెమెరా 108 మెగా పిక్సెల్కు జతగా 2-మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 33W, 67W ఛార్జింగ్ స్పీడ్లను సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీ ఇందులో ఉంటుంది. అంతేకాకుండా స్టీరియో స్పీకర్స్ కూడా ఈ ఫోన్లో అమర్చారు. (ప్రతీకాత్మక చిత్రం)
రియల్మీ 10 ప్రో+
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD AMOLED డిస్ప్లేతో లభించనుంది. ఇందులో ప్రత్యేకంగా కర్వ్డ్ డిజైన్ ఉంటుంది. రియల్ మీ 10 ప్రో+ న్యూ MediaTek డైమెన్సిటీ 1080 SoC చిప్సెట్ ద్వారా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ మోడల్ కూడా గరిష్టంగా 12GB RAM+ 256GB స్టోరేజ్ కెపాసిటీతో లభించనుంది.
స్టోరేజ్ కెపాసిటీని మరింతగా కూడా పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13-బేస్డ్ రియల్మీ UI 4.0 ఓఎస్‌పై ఈ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. ఫోన్ వెనుక భాగంలో 108 MP ప్రైమరీ సెన్సార్+ 8MP+2MP సెన్సార్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇక, ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 33W, 67W ఛార్జింగ్ స్పీడ్లను సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీ ఇందులో ఉంటుంది. అంతేకాకుండా స్టీరియో స్పీకర్స్ వంటి అదనపు ఫీచర్ ఈ స్మార్ట్ ఫోన్లో ఉండనున్నాయి.