రియల్మీ 10 ప్రో, రియల్మీ 10 ప్రో ఫ్లస్కు సంబంధించిన లాంచ్ ఈవెంట్ నవంబర్ 17న జరగనుంది. అయితే ఈవెంట్‌కు వారం రోజుల ముందు రియల్ మీ 10 5జీను చైనాలో లాంచ్ చేయడం గమనార్హం. చైనీస్ మార్కెట్లోకి లాంచ్ అయిన లేటెస్ట్ రియల్మీ 10 5జీ (Realme 10 5G) స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్, ధర వివరాలు పరిశీలిద్దాం.
రియల్మీ 10 5G స్మార్ట్‌ఫోన్ మీడియా టెక్ డైమెన్షిటీ 700 SoC ప్రాసెసర్ ద్వారా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. 8జీబీతో కూడిన LPDDR4X ర్యామ్ ఈ స్మార్ట్ ఫోన్‌కు పెయిర్‌గా వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 128జీబీ, 256జీబీ UFS 2.2 స్టోరేజ్‌తో లభిస్తుంది. ఈ స్టోరేజ్ సామర్థ్యాన్ని మైక్రో SD కార్డ్ ద్వారా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. వీటితో పాటు 6జీబీ వరకు అన్ యూజ్డ్ స్టోరేజ్‌ను వర్చువల్ ర్యామ్‌గా కూడా ఉపయోగించవచ్చు.
ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ 401 ppi పిక్సెల్ డెన్సిటీతో 6.6-అంగుళాల FHD+ అమోలెడ్ డిస్ప్లేతో లభిస్తుంది. ఈ ఫోన్ స్క్రీన్ 98 శాతం NTSC కవరేజ్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 5 లేయర్ ఈ హ్యాండ్సెట్ ప్యానెల్‌కు ప్రొటెక్షన్‌లా పనిచేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000 mAh సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తోంది.
కెమెరా సెటప్
రియల్మీ 10 5G స్మార్ట్‌ఫోన్‌లో 50 MP ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 2 MP మాక్రో యూనిట్, పోర్ట్రెయిట్ లెన్స్‌తో కలిసి వస్తుంది. ఫోన్ వాటర్‌డ్రాప్ నాచ్‌లో 8 MP సెల్ఫీ కెమెరా ఉంది. రియల్మీ10 5జీ ఆండ్రాయిడ్ 12తో రన్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)