1. అమెరికాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. 18 ఏళ్ల యువకుడి ప్రాణాలను హెడ్‌ఫోన్స్ కాపాడింది. అతను ధరించిన హెడ్‌ఫోన్స్ బుల్లెట్‌ను అడ్డుకోవడం విశేషం. Enough_Dance_956 పేరుతో ఉన్న రెడ్డిట్ యూజర్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలన్నీ పోస్ట్ చేశారు. అతను వెల్లడించిన వివరాల ప్రకారం ఆ యువకుడు రేజర్ కంపెనీకి చెందిన హెడ్‌ఫోన్స్ ధరించి ఇంట్లో స్నేహితులతో మాట్లాడుతున్నాడు. (Image credit: Enough_Dance_956/Reddit)
2. సరిగ్గా ఉదయం 10.30 గంటల సమయంలో ఓ బుల్లెట్ కిటికీ నుంచి దూసుకెచ్చింది. తలకు ఉన్న హెడ్‌ఫోన్స్‌కు తగిలింది. ఆ సమయంలో హెడ్‌ఫోన్స్ లేకపోయి ఉంటే బుల్లెట్ తలలోంచి దూసుకెళ్లేది. కానీ రేజర్ కంపెనీకి చెందిన హెడ్‌ఫోన్స్ ఆ బుల్లెట్‌ను అడ్డుకోవడం చూసి ఆ యువకుడు షాకయ్యాడు. (Image credit: Enough_Dance_956/Reddit)
3. ఒకవేళ హెడ్‌ఫోన్స్ మంచి క్వాలిటీవి కాకపోయి ఉంటే 18 ఏళ్లకే తన ప్రాణాలు పోయేవని ఆ యువకుడు చెప్పాడు. తాను మరణించి ఉంటే తన కుటుంబ సభ్యులు, స్నేహితులు పడే బాధను తాను ఊహించలేకపోతున్నానని అన్నాడు. రేజర్ కంపెనీ నుంచి ఎవరినైనా పట్టుకోండి, వారికి నేను హృదయ పూర్వకంగా ధన్యావాదాలు తెలపాలి అంటూ రెడ్డిట్‌లో పోస్ట్ చేయడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోస్ అన్నింటినీ రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు సదరు యూజర్. ఈ బుల్లెట్ చూస్తే తనను చంపడానికి ప్రయత్నించారని అర్థం అవుతోందని వివరించాడు. ఈ బుల్లెట్ కిటికీ అద్దాన్ని బ్రేక్ చేస్తూ అతని హెడ్‌ఫోన్‌కు తగిలింది. ఆ బుల్లెట్ తన తలకు తగిలి ఉంటే చనిపోయేవాడినని వివరించాడు. (Image credit: Enough_Dance_956/Reddit)
6. బ్రెజిల్లో ఓ వ్యక్తి వాడే స్మార్ట్‌ఫోన్ బుల్లెట్ ప్రూఫ్‌లా పనిచేసింది. దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్ని స్మార్ట్‌ఫోన్ అడ్డుకోవడం విశేషం. అతను ఐదేళ్ల క్రితం కొన్న మోటోరోలా జీ5 మొబైల్ వాడుతున్నాడు. ఆ స్మార్ట్‌ఫోన్‌కు మార్వెల్ కామిక్స్‌లో సూపర్ హీరో, ఫిక్షనల్ క్యారెక్టర్ హల్క్ క్యారెక్టర్‌తో ఉన్న మొబైల్ కవర్ ఉండటం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
7. దోపిడీ దొంగలు కాల్పులు జరపడంతో స్మార్ట్‌ఫోన్ బుల్లెట్‌ను అడ్డుకుంది. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ మొత్తం పగిలిపోయింది. స్మార్ట్‌ఫోన్ యూజర్‌కు ప్రాణాపాయం తప్పింది. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అంతకుముందు మరో ఘటనలో ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన కాల్పుల్లో నోకియా స్మార్ట్‌ఫోన్ కాల్పుల్లో బుల్లెట్‌ను అడ్డుకుంది. మరో ఘటనలో హాంగ్ కాంగ్లో గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్ కూడా బుల్లెట్‌ను అడ్డుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)