1. ప్రముఖ ఆడియో బ్రాండ్ పిట్రాన్ భారత మార్కెట్లోకి ట్రూ వైర్లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్) ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. దీని లాంచింగ్‌తో బాస్‌బడ్స్ శ్రేణిని మరింతగా విస్తరించింది. పిట్రాన్ బాస్‌బడ్స్ డ్యుయో (Ptron Bassbuds Duo) టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ బ్లూటూత్ v5.1 కనెక్టివిటీ గల టచ్-ఎనేబుల్డ్ కంట్రోల్స్‌తో వస్తాయి. (image: pTron India)
2. కాల్ క్లారిటీ, స్వెట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IPX4 సర్టిఫికేషన్‌తో వస్తాయి. దీనిలో ఇన్‌బిల్ట్ హెచ్డీ మైక్‌లను కూడా చేర్చింది. ఈ కొత్త టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను ఎర్గోనామిక్ డిజైన్‌తో తయారు చేసింది. స్టీరియో సౌండ్, బ్యాలెన్స్డ్ బాస్ కోసం 13 ఎంఎం డైనమిక్ డ్రైవర్లను అందించింది. (image: pTron India)
5. పిట్రాన్ బాస్‌బడ్స్ డ్యుయో స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే, కొత్త పిట్రాన్ బాస్‌బడ్స్ డ్యుయో టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ 13 ఎంఎం డైనమిక్ డ్రైవర్లతో వస్తాయి. మోనో, స్టీరియో కాల్స్ కోసం వీటిలో పాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్, డ్యుయోయల్ ఇన్‌బిల్ట్ హెచ్డీ మైక్రోఫోన్ వంటివి అందించింది. పిట్రాన్ ఇయర్‌బడ్స్ తేలికైన, ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. (image: pTron India)
6. ఈ ఇయర్‌బడ్స్ గరిష్టంగా 10 మీటర్ల ఆపరేటింగ్ దూరంతో బ్లూటూత్ v5.1 కనెక్టివిటీకి మద్దతిస్తాయి. ఇవి టచ్ కంట్రోల్స్‌తో వస్తాయి. తద్వారా కాల్స్‌కు సులభంగా ఆన్సర్ లేదా రిజక్ట్ చేయవచ్చు. మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోలింగ్, వాల్యూమ్‌ను అడ్జెట్ వంటివి కూడా టచ్ కంట్రోల్స్ చేయవచ్చు. (image: pTron India)
7. ఈ ఇయర్‌బడ్స్‌ను యూఎస్బీ టైప్- సీ పోర్ట్ ద్వారా ఛార్జింగ్ చేయవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే.. Ptron ప్రతి ఇయర్‌బడ్‌లో 35mAh బ్యాటరీని చేర్చింది. దీనిలోని ఛార్జింగ్ కేస్ 300mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇయర్‌బడ్స్ టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతిస్తాయి. వీటిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 15 గంటల వరకు ప్లేబ్యాక్‌ను అందిస్తాయి. వీటిని కేవలం 1 నుండి 1.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. (image: pTron India)