త్వరలో అమెజాన్ లో అద్భుతమైన ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ ప్రైమ్ డే సేల్ ను నిర్వహించనున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. కస్టమర్ల కోసం ఈ నెల 23-24 తేదీల్లో ప్రైమ్ డే సేల్ నిర్వహించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ సేల్ లో పలు రకాల వస్తులపై తగ్గింపు అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ ఆఫర్ కేవలం అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకున్న వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకోని వారు.. ఈ ఆఫర్లు పొందలేరు. కొత్తగా ఈ ఆఫర్ తీసుకోవాలనుకునే వారు రూ. 1499 ప్యాక్ తో ఏడాది పాటు రూ.179 ప్యాక్‌తో నెల పాటు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
అతి తక్కువ ధరలో వస్తువులను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదొక గొప్ప ఆఫర్. ఈ రెండు రోజుల్లో అమెజాన్ సైట్లో ఆ వస్తువులను ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న ఆఫర్ల విషయానికి వస్తే.. ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్లపై 40 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
అంతే కాకుండా.. గృహోపకరణాలపై 70 శాతం, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు తదితర వస్తువులపై 50 శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది. ఇలా రూ. 99 విలువ చేసే వస్తువుల నుంచి.. రూ. 1లక్ష విలువ చేసే వస్తువల వరకు అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భారీ తగ్గింపు లభించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)