* వైఫైకి కనెక్ట్ అయితేనే : ప్రైమరీ సబ్స్క్రైబర్ల లొకేషన్ని వైఫై కనెక్షన్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ రిజిస్టర్ చేసుకుంటుంది. తద్వారా ఆ వైఫైకి కనెక్ట్ అయి అకౌంట్‌ని వివిధ డివైజ్‌లలో ఉపయోగించుకోవచ్చు. కానీ, బయటి వ్యక్తులు చూడటానికి వీలుండదు. ఇక్కడే నెట్‌ఫ్లిక్స్ మరో కిటుకు పెట్టింది. ప్రైమరీ లొకేషన్లోనే ఆయా డివైజ్‌లు ఉన్నాయా లేవా? అని ధ్రువీకరించుకోవడానికి 31 రోజుల్లో కనీసం ఒక్కసారైనా యూజర్ వై-ఫైకి కనెక్ట్ అవ్వాలి.
అనంతరం యాప్ ద్వారా లేదా నెట్‌ఫ్లిక్స్ వెబ్సైట్ ద్వారా అందులోని వీడియోలను కాసేపు ప్లే చేయాల్సి ఉంటుంది.1 దీంతో ఒకవేళ ఆ వైఫైకి కనెక్ట్ కాలేకపోతే నెట్‌ఫ్లిక్స్‌కి లాగిన్ అవ్వలేరు. బయటి వ్యక్తులు కూడా ఒకే అకౌంట్‌ని వినియోగించేందుకు నెట్‌ఫ్లిక్స్ అవకాశం కల్పిస్తోంది. కానీ, దీనికి అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
* ఇంట్లో వాళ్లు బయటికి వెళ్తే? : వైఫై పరిధిలో లేకపోతే నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ని చూసేందుకు వీలు పడదు. అయితే, ప్రైమరీ యూజర్ బహిరంగ ప్రదేశాల్లో లేదా ప్రయాణాల సమయంలో నెట్‌ఫ్లిక్స్‌ని వినియోగించాలని భావిస్తే అందుకో పద్ధతిని తీసుకొచ్చింది. బయటకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రైమరీ యూజర్ ఓ తాత్కాలకి కోడ్కోసం రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కోడ్ ద్వారా ఇతర డివైజ్‌లలో లాగిన్ అయ్యేందుకు ఆస్కారముంటుంది. అయితే, ఇది కేవలం వారం రోజుల వరకు మాత్రమే వ్యాలిడిటీ కల్పించడం గమనార్హం.
* నిర్ణయంపై నెట్‌ఫ్లిక్స్ ధీమా : పాస్వర్డ్ షేరింగ్‌ని నిషేధించడంపై నెట్‌ఫ్లిక్స్ కో-సీఈవోలు ట్రెడ్ సరండోస్, గ్రెగ్ పీటర్ స్పందించారు. ఈ నిర్ణయం వల్ల తమ వినియోగదారుల సంఖ్య తగ్గిపోబోదని ఆశాభావం వ్యక్తం చేశారు. చాలామంది అదనపు యూజర్లు తమ ప్లాట్‌ఫాంలోని కంటెంట్‌ని వీక్షించడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు వారు తెలిపారు. బ్లూమ్‌బర్గ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరు ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపు, చిన్నారుల కోసం ప్రత్యేకంగా ‘కిడ్స్ మిస్టరీ బాక్స్’ని తీసుకొస్తున్నట్లు తెలిపారు.