స్పెసిఫికేషన్స్ అంచనాలు : Poco X5 సిరీస్ ఫోన్ల వివరాలు ఇప్పటికే మల్టిపుల్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్‌లో వెల్లడయ్యాయి. ఇటీవల చైనాలో లాంచ్ అయిన నోట్ 12 ఎడిషన్ మాదిరిగానే ఈ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది. Poco X5 Pro .. 6.67-అంగుళాల FHD+ OLED డిస్ప్లేతో రావచ్చు. ఇది గరిష్టంగా 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1080×2400 పిక్సెల్‌ల రిజల్యూషన్, HDR10+ సపోర్ట్‌ను అందించే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్ వినియోగించినట్లు సమాచారం. ఇది 12GB RAM వరకు అందించనుంది. ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ 512GB వరకు ఉండవచ్చు.
ట్రిపుల్ కెమెరా సెటప్ : ఈ హ్యాండ్‌సెట్‌లో 5,000mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఇది 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుందని నివేదికలు చెబుతున్నాయి. ఫోన్ ముందు భాగంలో సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉండే అవకాశం కనిపిస్తోంది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుందని సమాచారం. ఇందులో 108MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్ ఉండే అవకాశం ఉంది.
ఇటీవల లాంచ్ అయిన పోకో C50 : పోకో కంపెనీ ఇటీవల C సిరీస్‌కు కొనసాగింపుగా పోకో C50 ఇటీవల లాంచ్ చేసింది. ఎంట్రీ లెవల్లో వచ్చిన ఈ హ్యాండ్సెట్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 2GB+32GB వేరియంట్ ధర రూ.6,499 కాగా, 3GB+32GB వేరియంట్ ధర రూ.7,299గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ HD+ రిజల్యూషన్‌తో 6.52-అంగుళాల వాటర్-డ్రాప్ నాచ్ ప్యానెల్‌తో లభిస్తుంది.
జనవరి 10 నుంచి విక్రయాలు:హ్యాండ్సెట్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 8MP AI ప్రైమరీ కెమెరా, మరో సెన్సార్ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం Poco C50లో 5MP కెమెరా ఉంటుంది. ఫ్రంట్ అండ్ రియర్ సెన్సార్స్ 30 fps వద్ద 1080 పిక్సెల్ వీడియోలను షూట్ చేస్తాయి. పోకో సీ50 అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్‌లో జనవరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. కంట్రీ గ్రీన్, రాయల్ బ్లూ వంటి రెండు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. లాంచ్ డే ఆఫర్ కింద 2GB వేరియంట్‌ను రూ.6,249కు, 3GB వేరియంట్‌ను రూ.6,999కు విక్రయించనున్నారు.