2. పోకో ఎక్స్5 5జీ మొబైల్లో పాపులర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, అమొలెడ్ డిస్ప్లే, 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పటికే ఇదే బడ్జెట్లో, స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పలు మొబైల్స్ ఉన్నాయి. వాటికి పోకో ఎక్స్5 5జీ గట్టి పోటీ ఇవ్వనుంది. మరి పోకో ఎక్స్5 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఏంటీ, ఆఫర్స్ ఎలా ఉన్నాయి, తెలుసుకోండి. (image: Poco India)
3. పోకో ఎక్స్5 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999. సూపర్నోవా గ్రీన్, జాగ్వార్ బ్లాక్, వైల్డ్‌క్యాట్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. ఇప్పటికే సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. (image: Poco India)
4. ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో కొంటే రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేసేవారికి అదనంగా రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. మొత్తం రూ.16,500 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. (image: Poco India)
5. పోకో ఎక్స్5 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ లభిస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రెడ్మీ నోట్ 11 ప్రో+, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ లాంటి మొబైల్స్‌లో ఇదే ప్రాసెసర్ ఉంది. (image: Poco India)
6. పోకో ఎక్స్5 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ఇందులో టర్బో ర్యామ్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో అదనంగా 5జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. అంటే గరిష్టంగా 13జీబీ వరకు ర్యామ్ ఉపయోగించవచ్చు. పోకో ఎక్స్5 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. (image: Poco India)