1. ఇండియాలో పోకో ఎక్స్3 ప్రో అప్‌గ్రేడ్ వర్షన్ పోకో ఎక్స్4 ప్రో 5జీ (Poco X4 Pro 5G) స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఇందులో పాపులర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ (Qualcomm Snapdragon 695), అమొలెడ్ డిస్ప్లే, 64మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 5జీ కనెక్టివిటీ లాంటి ప్రత్యేకతలున్నాయి. (image: Poco India)
2. పోకో ఎక్స్3 ప్రో యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేసి పోకో ఎక్స్4 ప్రో 5జీ కొనాలనుకుంటే వారికి అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది కంపెనీ. పోకో ఎక్స్3 ప్రో ఎక్స్ఛేంజ్ చేసి పోకో ఎక్స్4 ప్రో 5జీ బేస్ మోడల్‌ను రూ.6,549 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్ లభించబోతోంది. ఆఫర్ పూర్తి వివరాలివే. (image: Poco India)
3. పోకో ఎక్స్4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.21,999. పోకో ఎక్స్3 ప్రో ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.8,450 డిస్కౌంట్ లభిస్తుంది. (image: Poco India)
4. దీంతో పాటు అదనంగా రూ.3,000 బంపర్ డిస్కౌంట్ లభిస్తుంది. మొత్తం కలిపి రూ.11,450 డిస్కౌంట్ పొందొచ్చు. ఫైనల్ ఎక్స్ఛేంజ్ ధర రూ.7,549. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుతో కొంటే మరో రూ.1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే రూ.6,549 చెల్లిస్తే చాలు. ఏప్రిల్ 5న సేల్ ప్రారంభం అవుతుంది. లేజర్ బ్లూ, లేజర్ బ్లాక్, పోకో ఎల్లో కలర్స్‌లో కొనొచ్చు. (image: Poco India)
5. పోకో ఎక్స్4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz అమొలెడ్ డిస్ప్లే ఉంది. ముందు, వెనుక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉండటం విశేషం. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రెడ్మీ నోట్ 11 ప్రో+, వివో టీ1, రియల్మీ 9 ప్రో, మోటో జీ71 స్మార్ట్ఫోన్లలో కూడా ఉంది. (image: Poco India)
6. పోకో ఎక్స్4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 64మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో హెచ్డీఆర్, ఏఐ పోర్ట్రైట్ మోడ్, ప్రోమోడ్, ఏఐ సీన్ డిటెక్షన్, నైట్ మోడ్, షార్ట్ వీడియో, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, పనోరమా, ఏఐ వాటర్‌మార్క్, ప్రో కలర్, టైమ్డ్ బరస్ట్, టిల్ట్ షిఫ్ట్, అల్ట్రా వైడ్ మోడ్, మ్యాక్రో మోడ్, లాంగ్ ఎక్స్పోజర్, డ్యూయెల్ వీడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Poco India)
8. పోకో ఎక్స్4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయెల్ స్పీకర్స్, హెడ్‌ఫోన్ జాక్, హైబ్రిడ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, బ్లూటూత్ 5.1 లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Poco India)