Poco X3 Pro: పోకో ఇండియా నుంచి లేటెస్ట్గా రిలీజైన స్మార్ట్‌ఫోన్ పోకో ఎక్స్3 ప్రో. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.20,999. పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ 120Hz డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Poco India)
Poco X3 Pro: పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ Sony IMX582 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ రియర్ కెమెరా సెటప్ ఉండగా 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో బ్యాటరీ 5160ఎంఏహెచ్. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. గోల్డెన్ బ్రాంజ్, గ్రాఫైడ్ బ్లాక్, స్టీల్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. (image: Poco India)
Realme 8 Pro: రియల్మీ నుంచి లేటెస్ట్గా రిలీజైన స్మార్ట్‌ఫోన్ ఇది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,999. రియల్మీ 8 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Realme India)
Realme 8 Pro: రియల్మీ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ సాంసంగ్ ISOCELL HM2 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. రియల్మీ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 50వాట్ సూపర్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 47 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్ చేయొచ్చు.
Redmi Note 10 Pro Max: రెడ్మీ ఇటీవల రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. ధర చూస్తే 6జీబీ+64జీబీ వేరియంట్ రూ.18,999 కాగా 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.19,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.21,999. ఇక రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Redmi India)
Redmi Note 10 Pro Max: రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ రియర్ కెమెరా సెటప్ చూస్తే 108మెగాపిక్సెల్ సాంసంగ్ ISOCELL GW3 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ బ్యాటరీ 5020ఎంఏహెచ్. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వింటేజ్ బ్రాంజ్, గ్లాసియల్ బ్లూ, డార్క్ నైట్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Redmi India)
Realme X7 5G: రియల్మీ ఎక్స్7 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + అల్ట్రా వైడ్ సెన్సార్ + మ్యాక్రో సెన్సార్ రియర్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ 4310ఎంఏహెచ్. 50వాట్ సూపర్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. స్పేస్ సిల్వర్, నెబ్యులా కలర్స్‌లో కొనొచ్చు. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,999 కాగా, 8జీబీ+128జీబీ ధర రూ.21,999. (image: Realme India)
Moto G 5G: కొద్ది రోజుల క్రితం మోటోరోలా నుంచి మోటో జీ 5జీ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజైంది. మోటో జీ 5జీ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ + ఎల్టీపీఎస్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 48 మెగాపిక్సెల్ ప్రైమసీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ సెకండరీ వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ కాగా ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. (image: Motorola India)
Moto G 5G: మోటో జీ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 20వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 15 నిమిషాలు రీఛార్జ్ చేస్తే 10 గంటలపాటు స్మార్ట్‌ఫోన్ ఉపయోగించొచ్చు. మోటో జీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్రోస్టెడ్ సిల్వర్, వోల్కానిక్ గ్రే కలర్స్‌లో కొనొచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.20,999. ఆఫర్లో రూ.18,999 ధరకే కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో హెచ్డీఎఫ్సీ కార్డుపై డిస్కౌంట్ కూడా ఉంది.
Xiaomi Mi 10i: షావోమీ ఎంఐ 10ఐ 5జీ స్మార్ట్‌ఫోన్. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ముందు, వెనుకవైపు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ 750జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్ చూస్తే 108మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు ఇష్టపడేవారి కోసం ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్‌లో ముందువైపు 16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. (image: Xiaomi India)
Xiaomi Mi 10i: ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్‌లో 4,820ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్‌ను అట్లాంటిక్ బ్లూ, పసిఫిక్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.20,999 కాగా 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.21,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.23,999. (image: Xiaomi India)
Realme Narzo 30 Pro: రియల్మీ నార్జో 30 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఎల్సీడీ 120Hz డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా: 48మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ రియర్ కెమెరా సెటప్ ఉండగా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: Realme India)
Realme Narzo 30 Pro: రియల్మీ నార్జో 30 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30వాట్ డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 10 + రియల్మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. స్వార్డ్ బ్లాక్, బ్లేడ్ సిల్వర్ కలర్స్‌లో కొనొచ్చు. 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.16,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,999. (image: Realme India)