POCO X3 Price Cut: కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.2,000 తగ్గింది
POCO X3 Price Cut: కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.2,000 తగ్గింది
POCO X3 Price Cut | పోకో ఎక్స్3 ధర తగ్గింది. కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. తగ్గిన రేట్లతో ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. పోకో ఎక్స్3 లేటెస్ట్ రేట్స్ తెలుసుకోండి.
1/ 8
1. పోకో ఇండియా ఇటీవల పోకో ఎక్స్3 ధర తగ్గిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త రేట్స్ అప్డేట్ అయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గిన రేట్స్ కనిపిస్తున్నాయి. గతంలో కన్నా రూ.2,000 తక్కువ ధరకే పోకో ఎక్స్3 కొనొచ్చు. (image: Poco India)
2/ 8
2. పోకో ఎక్స్3 గతేడాది ఇండియాలో రిలీజైంది. అప్పుడు పోకో ఎక్స్3 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.16,999 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.18,499. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.19,999. (image: Poco India)
3/ 8
3. పోకో ఎక్స్3 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్‌పై రూ.2,000 ధర తగ్గగా 6జీబీ+128జీబీ వేరియంట్‌పై రూ.1,500 ధర తగ్గింది. ఇక 8జీబీ+128జీబీ వేరియంట్‌పై రూ.1,000 తగ్గింది. (image: Poco India)
4/ 8
4. ప్రస్తుతం పోకో ఎక్స్3 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ రూ.14,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.16,999 ధరకు కొనొచ్చు. ఇక 8జీబీ+128జీబీ వేరియంట్ మోడల్‌ను రూ.18,999 ధరకు కొనొచ్చు. (image: Poco India)
5/ 8
5. ఇటీవల పోకో ఎక్స్3 అప్‌గ్రేడ్ వేరియంట్ పోకో ఎక్స్3 ప్రో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అందుకో పోకో ఎక్స్3 ధరను తగ్గించింది పోకో ఇండియా. (image: Poco India)
6/ 8
6. ఇక పోకో ఎక్స్3 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.67 అంగుళాల పుల్ హెచ్డీ+ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Poco India)
7/ 8
7. పోకో ఎక్స్3 రియర్ కెమెరా వివరాలు చూస్తే 64 మెగాపిక్సెల్ Sony IMX 682 సెన్సార్ + 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ + 2 మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్‌లో 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. (image: Poco India)
8/ 8
8. పోకో ఎక్స్3 బ్యాటరీ 6000ఎంఏహెచ్. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. షాడో గ్రే, కోబాల్ట్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. (image: Poco India)