1. ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ఫోన్లపై గతంలో కన్నా మంచి ఆఫర్స్ లభిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో రూ.20,000 లోపు బడ్జెట్లో రిలీజైన పోకో ఎం4 ప్రో 4జీ (Poco M4 Pro 4G) స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఆఫర్లో రూ.9,999 ధరకే కొనొచ్చు. బ్యాంక్ ఆఫర్స్‌తో తక్కువ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. పోకో ఎం4 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్‌లో అమొలెడ్ డిస్ప్లే, హీలియో జీ96 ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Poco India)
2. పోకో ఎం4 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. రిలీజ్ ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.17,999. ప్రస్తుత ధరలు చూస్తే 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.10,999 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.11,999. ఇక 8జీబీ+128జీబీ ధర రూ.13,999. (image: Poco India)
3. బ్యాంక్ ఆఫర్స్‌తో కొనేవారికి బేస్ వేరియంట్ కేవలం రూ.9,999 ధరకే లభిస్తుంది. కొటక్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ క్రెడిట్ కార్డులతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ రూ.2,334 నుంచి ప్రారంభం అవుతుంది. (image: Poco India)
4. పోకో ఎం4 ప్రో 4జీ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్ప్లే ఉంది. తొలిసారి పోకో ఎం సిరీస్‌లో అమొలెడ్ డిస్ప్లే ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ96 గేమింగ్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియల్మీ నార్జో 50 (Realme Narzo 50), రెడ్మీ నోట్ 11ఎస్ (Redmi Note 11S) మోడల్స్‌లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. (image: Poco India)
6. పోకో ఎం4 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. టర్బోర్యామ్ ఫీచర్‌తో 11జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్ 5.0 లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. (image: Poco India)