1. పోకో ఇండియా ఇటీవల భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) రిలీజ్ చేసింది. పోకో ఎం4 5జీ (Poco M4 5G) మోడల్‌ను పరిచయం చేసింది. గతేడాది బాగా పాపులర్ అయిన పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ వేరియంట్ ఇది. ఈసారి పోకో ఇండియా ఎం సిరీస్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయడం విశేషం. (image: Poco India)
2. పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 90Hz డిస్ప్లే, 50మెగాపిక్సెల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. రూ.15,000 లోపు బడ్జెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఇదే బడ్జెట్లో 6GB+128GB మొబైల్ సొంతం చేసుకోవచ్చు. ఇప్పటికే రూ.15,000 లోపు బడ్జెట్లో ఉన్న వివో టీ1, రెడ్మీ నోట్ 10టీ, మోటో జీ51 లాంటి మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. (image: Poco India)
3. పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.10,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.12,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: Poco India)
4. పోకో ఎం4 5జీ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో మే 5 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. బ్లాక్, బ్లూ, ఎల్లో కలర్స్‌లో కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి రూ.451 నుంచి ఈఎంఐ ఆప్షన్స్ లభిస్తాయి. (image: Poco India)
5. పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ వివో వై75, సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42, రెడ్మీ నోట్ 10టీ, రియల్మీ నార్జో 30 స్మార్ట్ఫోన్లలో ఉంది. (image: Poco India)
6. పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు రెండు కెమెరాలు ఉంటాయి. రియర్ కెమెరాలో పోర్ట్రైట్, పనోరమా, ప్రో మోడ్, నైట్ మోడ్, HDR, ఏఐ సీన్ డిటెక్షన్, గూగుల్ లెన్స్, మూవీ ఫ్రేమ్, ప్రో కలర్, టిల్ట్ షిఫ్ట్, డాక్యుమెంట్ మోడ్, టైమ్డ్ బరస్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Poco India)
8. పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్సులో 22.5వాట్ ఛార్జర్ లభిస్తుంది. 100శాతం ఛార్జింగ్ చేయడానికి 108 నిమిషాల సమయం పడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. టర్బో ర్యామ్ ఫీచర్‌తో అదనంగా 2జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. మెమొరీ కార్డుతో 512జీబీ స్టోరేజ్ పంచుకోవచ్చు. (image: Poco India)